లూసిఫర్ రీమేక్ నుంచి తప్పుకున్న వివి వినాయక్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతంవరుస సినిమాలు లైన్ లో పెట్టి ఉంచాడు.ఒకదాని తర్వాత ఒకటిగా సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే ఆచార్య సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లారు.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్ళీ వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత లూసిఫర్ రీమేక్, వేదాళం రీమేక్ లైన్ లో ఉన్నాయి.వేదాళం రీమేక్ బాధ్యతలని మెహర్ రమేష్ కి అప్పగించాడు.

అలాగే లూసిఫర్ రీమేక్ బాధ్యతలని వివి వినాయక్ కి అప్పగించాడు.ముందుగా ఈ సినిమా బాధ్యతలని యంగ్ డైరెక్టర్ సుజిత్ కి అప్పగిస్తే హ్యాండిల్ చేయలేనని తప్పుకున్నాడు.

Advertisement

తరువాత వినాయక్ లైన్ లోకి వచ్చాడు.అయితే ప్రస్తుతంటాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ రీమేక్ బాధ్యతల నుంచి వినాయక్ కూడా తప్పుకున్నాడని తెలుస్తుంది.

స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కి వినాయక్ నేరేట్ చేసాడని, అయితే చిరంజీవి మరల కొన్ని మార్పులు సూచించడం జరిగిందని సమాచారం.అయితే స్క్రిప్ట్ చేంజ్ విషయంలో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా వినాయక్ సినిమా నుంచి తప్పుకున్నాడని వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో ఆచార్య తర్వాత వేదాళం రీమేక్ ని ముందుగా సెట్స్ పైకి తీసుకొని వెళ్లాలని, తరువాత లూసిఫర్ ని సెట్స్ పైకి ఎక్కించాలని అనుకుంటున్నట్లు సమాచారం.వినాయక్ తప్పుకోవడం ఆ సినిమా రీమేక్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలి అనే విషయంపై చిరంజీవి ఆలోచనలో పడ్డట్లు టాక్ నడుస్తుంది.

మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే చిరంజీవి టీం నుంచి గాని, వినాయక్ నుంచి గాని క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు