అప్పు తీసుకున్న డబ్బుతో వ్యాపారం.. ఇప్పుడు రూ.6100 కోట్లకు అధిపతి.. విజయ్ సంకేశ్వర్ సక్సెస్ స్టోరీకి ఫిదా అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో ఏదైనా వ్యాపారం చేసి సక్సెస్ సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే.

ఒక వ్యక్తి తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే రేయింబవళ్లు తీవ్రస్థాయిలో శ్రమించాల్సి ఉంటుంది.

డబ్బులు ఉంటే మాత్రమే వ్యాపారం చేయడం సాధ్యమవుతుంది.అయితే విజయ్ సంకేశ్వర్ అనే వ్యక్తి మాత్రం ఒకప్పుడు అప్పులు చేసి ట్రక్కు కొనుగోలు చేసి బిజినెస్ ను మొదలుపెట్టాడు.

ప్రస్తుతం ఆయనకు 5700కు పైగా ట్రక్కులు ఉన్నాయి.వీ.ఆర్.ఎల్ లాజిస్టిక్స్ యజమాని అయిన విజయ్ సంకేశ్వర్( Vijay Sankeshwar ) సక్సెస్ స్టోరీ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు.

గడిచిన 5 సంవత్సరాలలో అతని కంపెనీ స్టాక్ మార్కెట్ లో 115 శాతం రాబడిని ఇచ్చింది.ప్రస్తుతం విజయ్ కంపెనీ మార్కెట్ క్యాప్ విలువ 6142 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

Advertisement

కర్ణాటక( Karnataka ) రాష్ట్రంలోని ధార్వాడ్ ప్రాంతంలో జన్మించిన విజయ్ సంకేశ్వర్ 1970 సంవత్సరంలో రవాణా బిజినెస్( Transportation Business ) లోకి రావాలని అనుకుని సొంతంగా లాజిస్టిక్స్ కంపెనీని మొదలుపెట్టాడు.కుటుంబం నుంచి సపోర్ట్ లభించకపోవడంతో పరిచయస్తుని దగ్గర డబ్బులను అప్పుగా తీసుకుని బిజినెస్ ను మొదలుపెట్టాడు.అయితే విజయ్ సంగేశ్వర్ కెరీర్ పరంగా సులువుగా సక్సెస్ కాలేదు.

ఆయన ఈ స్థాయికి చేరుకునే విషయంలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నారు.ఎన్నో సవాళ్లను ఎదుర్కొని కోట్ల రూపాయల సంస్థకు అధిపతిగా మారిన విజయ్ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.విజయ్ సంకేశ్వర్ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

విజయ్ సంకేశ్వర్ ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఈ స్థాయికి చేరుకున్నారు.కెరీర్ విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తే విజయ్ సంకేశ్వర్ భవిష్యత్తులో బిజినెస్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?
Advertisement

తాజా వార్తలు