తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది.సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ భేటీ రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపింది.
మరి కాసేపటిలో అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్( Vote on account budget ) ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
మధ్యాహ్న 12 గంటలకు మొదటిసారి బడ్జెట్ ను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క( Mallu Bhatti Vikramarka ) ప్రవేశపెట్టనున్నారు.అటు మండలిలో బడ్జెట్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు.వాస్తవ ఆదాయం ప్రాతిపదికన బడ్జెట్ రూపకల్పన చేశారని తెలుస్తోంది.అదేవిధంగా ఈ సంవత్సరం రూ.3 లక్షల కోట్ల వరకు బడ్జెట్ ఉండే అవకాశం ఉంది.సంక్షేమం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సాగునీటి పారుదలకు అధిక నిధులు కేటాయించారని తెలుస్తోంది.అలాగే ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు( six guarantees ) అధిక ప్రాధాన్యతను ఇస్తున్న సంగతి తెలిసిందే.