వైసీపీ నేత, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ( Posani Krishna Murali ) కీలక వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్లపై టీడీపీ అధినేత చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
వాలంటీర్లు నిస్వార్థంగా సేవ చేస్తున్నారన్న ఆయన నారా లోకేశ్ ( Nara Lokesh )లా వాలంటీర్లు వ్యవహరించడం లేదని చెప్పారు.చంద్రబాబు కుట్రల వలనే రాష్ట్రంలో వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని తెలిపారు.
చంద్రబాబుకు మహిళలు అంటే గౌరవం లేదని పోసాని తీవ్రంగా మండిపడ్డారు.