ప్రజల కోసమే వాలంటీర్ - సచివాలయ వ్యవస్థ..: సీఎం జగన్

ఏపీలోని జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంపు అమల్లోకి వస్తుందని తెలిపారు.

 Volunteer - Secretariat System For People..: Cm Jagan-TeluguStop.com

జనవరి ఒకటో తేదీ నుంచి 8 వరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్న సీఎం జగన్ 3వ తేదీన పెన్షన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొంటానని పేర్కొన్నారు.

ప్రజలు ఇబ్బందులు పడకూడదనే వాలంటీర్ – సచివాలయ వ్యవస్థను గ్రామస్థాయిలోకి తీసుకొచ్చామన్నారు.అలాగే జనవరి 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.తరువాత ఫిబ్రవరి 15, 16 తేదీల్లో ఉత్తమ వాలంటీర్లకు అవార్డులను అందజేయనున్నట్లు వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube