Pawan Kalyan : పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు .. ఎందుకంటే ? 

ఏపీలో కీలకమైన ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదు అయ్యింది.

గతంలో వాలంటీర్లకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్( Janasena Pawan Kalyan ) చేసిన వ్యాఖ్యలపై గుంటూరు న్యాయస్థానం క్రిమినల్ కేసు నమోదు అయింది.

వాలంటీర్లకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగించారంటూ గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వాలంటీర్ పవన్ కుమార్( Volunteer Pawan Kumar ) ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు అయింది.దీనిని విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన న్యాయస్థానం ఐపిసి సెక్షన్ 499, 500 కింద కేసు నమోదు అయ్యింది .ఈ కేసును నాలుగో అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేయడంతో పాటు, మార్చి 25న గుంటూరు జిల్లా కోర్టు( Guntur Court )కు పవన్ కళ్యాణ్ హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు .

జూలై 3న ఏలూరులో వారాహి యాత్ర( Varahi Yatra )లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై అనేక ఆరోపణలు చేశారు.రాష్ట్రంలో మహిళల అదృశ్యం వెనుక వాలంటీర్ వ్యవస్థ( Volunteers ) ఉందని పవన్ కళ్యాణ్ ఆరోపించినట్లు గా కేసులో పేర్కొన్నారు.కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29 వేల నుంచి 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారంటూ పవన్ ఆరోపణలు చేశారు.

వారిలో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని , మిగిలిన వారి గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రశ్నించడం లేదంటూ పవన్ ప్రశ్నించారు.

Advertisement

దీనిపై అప్పట్లోనే వాలంటీర్లకు తోపాటు,  వైసీపీ నేతలు( YCP Leaders ) పవన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నిరసనలు చేపట్టారు.తాజాగా ఈ వ్యవహారంపై కేసు నమోదు కావడం, రాజకీయంగా సంచలనంగా మారింది.ఇదిలా ఉంటే ఈరోజు ,రేపు పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించనున్నారు.

మధ్యాహ్నం 2:30 గంటలకు చేరుకుంటారు.అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్తలతో ఆయన సమావేశం నిర్వహిస్తారు.

Advertisement

తాజా వార్తలు