సినిమా ఇండస్ట్రీకి చెందిన నటులలో ఒక్కొక్కరు ఒక్కో తరహా పాత్రలను కోరుకుంటారు.సీనియర్ నటుడు వీకే నరేష్( VK Naresh ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఈరోజు వీకే నరేష్ పుట్టినరోజు కాగా మంచి నటుడు కావాలని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకున్నానని నటుడిగా 50 సంవత్సరాల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకోవడం ప్రేక్షకుల ప్రేమ, అభిమానాల వల్లే సాధ్యమైందని వీకే నరేష్ అన్నారు.
నా జీవితాంతం సినిమా ఇండస్ట్రీకి సేవ చేస్తానని వీకే నరేష్ చెప్పుకొచ్చారు.
పండంటి కాపురం సినిమాతో ( Pandanti kapuram )బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టానని సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది మహనీయులతో కలిసి పని చేసే అవకాశం దక్కిందని వీకే నరేష్ పేర్కొన్నారు.రాజకీయాలు, సమాజ సేవ వల్ల పది సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నానని వీకే నరేష్ కామెంట్లు చేయడం గమనార్హం.
ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి బిజీగా ఉన్నానని వీకే నరేష్ చెప్పుకొచ్చారు.నాకు నెగిటివ్ రోల్స్ చేయాలని ఉందని నరేష్ అన్నారు.ఇకపై ఏ ప్రభుత్వం అయినా సినిమా ఇండస్ట్రీకి తగినంత గౌరవం, ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కామెంట్లు చేశారు.నంది అవార్డులను పరిశ్రమ గౌరవంగా చూస్తుందని కానీ ఇప్పుడా అవార్డులు ఇవ్వడం లేదని నరేష్ వెల్లడించడం గమనార్హం.
నంది అవార్డులను( Nandi Awards ) మళ్లీ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని వీకే నరేష్ కామెంట్లు చేశారు.మా అబ్బాయి నవీన్ ( Naveen )కు డైరెక్టర్ గా మంచి భవిష్యత్ ఉంటుందని నమ్ముతున్నానని వీకే నరేష్ చెప్పుకొచ్చారు.మా విజయ కృష్ణ గ్రీన్ స్టూడియోస్ ను మోడ్రన్ స్టూడియోగా చేస్తున్నామని వీకే నరేష్ కామెంట్లు చేశారు.నెగిటివ్ రోల్స్ లో నటించాలన్న వీకే నరేష్ కోరిక తీరుతుందో లేదో చూడాలి.
దర్శకనిర్మాతలు వీకే నరేష్ కు నెగిటివ్ రోల్స్ లో నటించే ఛాన్స్ ఇస్తారో లేదో చూడాల్సి ఉంది.