రాజమౌళి మహేష్ బాబు సినిమాపై అలాంటి కామెంట్స్ చేసిన నరేష్ !

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటుడు నరేష్ ( Naresh ) ఒకరు.ఈయన విజయనిర్మల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.

 Vk Naresh Comments About Mahesh And Rajamouli Movie, Rajamouli, Naresh, Mahesh B-TeluguStop.com

కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరోగా నటించినటువంటి నరేష్ అనంతరం సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈయన వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారనే చెప్పాలి.

ఇకపోతే సరిగా ఈయన ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.

Telugu Mahesh Babu, Naresh, Rajamouli, Tollywood-Movie

ఇలా ఈయన 50 సంవత్సరాల సినీ కెరియర్ ను పూర్తి చేసుకున్న సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ నేను చిన్నప్పుడు పొద్దున లేవగానే అమ్మ విజయనిర్మల( Vijaya Nirmala ) కృష్ణ గారి మేకప్ రూమ్ చూసేవాడిని వారి కోసం వచ్చే వారందరినీ చూశాను ఆ సమయంలోనే నాకు కూడా ఇలాంటి జీవితమే కావాలి అనిపించింది అందుకే ఇండస్ట్రీ వైపు వచ్చానని తెలిపారు.

Telugu Mahesh Babu, Naresh, Rajamouli, Tollywood-Movie

ప్రస్తుత కాలంలో ఒక నటుడు 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో కొనసాగడం చాలా కష్టంగా మారింది.అలాంటిది 50 సంవత్సరాల పాటు నేను ఇండస్ట్రీలో ఉన్నాను అంటే అందుకు కారణం ప్రేక్షకులేనని వారు ఆదరించడం వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నానని తెలిపారు.ఇలా తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నటువంటి ఈయనకు మహేష్ బాబు రాజమౌళి ( Rajamouli ) కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఈ సినిమా పై నరేష్ స్పందిస్తూ… మహేశ్‌( Mahesh Babu )కు మాస్, క్లాస్.అన్ని వర్గాల్లో అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.రాజమౌళి గారు ప్రపంచానికి ఇండియన్ సినిమాని పరిచయం చేసిన ఐకాన్.వాళ్ల ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే సినిమా అంటే ఆ సినిమాలో మరో లెవెల్ లో ఉంటుందని ఈ సందర్భంగా నరేష్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube