చిత్రం : వివేకంబ్యానర్ : సత్యజ్యోతి ఫిలిమ్స్ దర్శకత్వం : శివ నిర్మాతలు : సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యారరాజన్ సంగీతం : అనిరుద్ విడుదల తేది : ఆగష్టు 24, 2017 నటీనటులు : అజిత్ కుమార్, కాజల్ అగర్వాల్, వివేక్ ఒబెరాయ్, అక్షర హాసన్ తదితరులు
అజిత్ కుమార్ అంటే తెలుగు వారికి పరిచయం అక్కరలేని లేని పేరు.వాలి తెలుగులో బాగా ఆడింది కూడా.
అజిత్ – శివ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన వీరం, వేదాలం రెండు మంచి సక్సెస్ ని చవిచూసాయి.ఇందులో వీరమ్ ని పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరుతొ రీమేక్ చేయగా, వేదాలంని కూడా రీమేక్ చేసే ఆలోచనలు ఉన్నాయి.
ఇలాంటి హిట్ కాంబినేషన్లో భారి యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది వివేగం.దీన్నే తెలుగులోకి వివేకం పేరుతొ అనువదించారు.తెలుగు రాష్ట్రాల్లో భారి స్థాయిలో 400లకు పైగా థియేటర్స్ లో విడుదలవుతున్న వివేకం రివ్యూ ఇప్పుడు చూసేద్దాం.
కథలోకి వెళితే :
అజయ్ కుమార్ (అజిత్) తీవ్రవాదం మీద పంజా విసిరే ఒక స్పెషల్ ఆఫీసర్.ఇతని స్నేహితుడు ఆర్యన్ సిన్ఘ (వివేక్ ఒబెరాయ్).అజయ్ భార్య యాజ్హిని (కాజల్).వృత్తి, పర్సనల్ లైఫ్ తో సంతోషంగా సాగుతున్న అజయ్ జీవితంలో ఓ పెద్ద మోసం జరుగుతుంది.ఆ పన్నగం పన్నిందో ఎవరో కాదు, తన స్నేహితుడైన ఆర్యన్.
దాంతో పరారయిన అజయ్ తన పగ ఎలా తీర్చుకున్నాడు, తన భార్య, పుట్టబోయే బిడ్డ కోసం ఎలాంటి అవరోధాలు ఎదుర్కొన్నాడు తెర మీద చూడండి.
నటీనటుల నటన :
అజిత్ ఎంత గొప్ప నటుడో తమిళ సినిమాలను కొంచెం ఫాలో చేసిన తెలిసిపోతుంది.అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా సాగుతుంది అజిత్ నటన.అది కాకుండా, ఈ వయసులో ఆహార్యం మార్చుకోవడం, పాతికేళ్ళ కుర్రాడిలా చాలా రిస్కీ స్టంట్స్ చేయడం అబ్బురపరుస్తుంది.25 ఏళ్ల అజిత్ కెరీర్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది సినిమా చూస్తే.తన ట్రేడ్ మార్క్ స్టయిల్ వాకింగ్, ఆ ఇంటెన్స్ హావాభావాలు, మధ్యమధ్యలో భారి యాక్షన్ ఎపిసోడ్స్, వాటిలో అజిత్ స్టంట్స్ .అజిత్ ఫ్యాన్స్ ని, ఆడియెన్స్ ని నూటికి రెండు వందల శాతం మెప్పిస్తాడు
కాజల్ అందంగా ఉంది.కాని తన పాత్ర చిత్రానికి ఓ మైనస్.
ఇలాంటి స్పై సినిమాల్లో హీరోయిన్ కూడా ఏజెంట్ గా ఉంటేనే ప్రేక్షకులకి మజా.కాని కాజల్ పాత్ర మరీ రొటీన్ ఫీల్ తెప్పిస్తుంది.విలన్ గా ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించిన వివేక్ ఒబెరాయ్ మెప్పిస్తాడు.కామియోలో అక్షర హాసన్ మెరిసింది.
టెక్నికల్ టీమ్ :
అనిరుద్ బాణీలు తమిళనాడుని ఓ ఊపు ఒప్పుతున్నాయి.ఇక “సర్వైవా” అనే పాట తెలుగు శ్రోతల్ల్ని కూడా విపరీతంగా అలరించింది.
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆదరగోట్టేసాడు అనిరుద్.కొత్త కొత్త వాద్యాలు వాడుతూ, రీ రికార్డింగ్ ఫ్రెష్ గా ఉండేలా జాగ్రత్తపడ్డాడు.
ఇక ఈ సినిమాలో కెమెరా వర్క్ గురించి చాలాసేపు మాట్లాడుకోవచ్చు.ఫ్రేమ్స్ హాలివుడ్ సినిమాని తలపిస్తాయి.
స్లోవేనియా లాంటి అందమైన దేశంలో చిత్రీకరణ జరపడంతో కెమెరా వర్క్ మరింత అందంగా కనిపిస్తుంది.యాక్షన్ సన్నివేశాల కోసం బాగా కష్టపడ్డారు కెమెరా డిపార్ట్మెంట్ వారు.
యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి.ఓ రెండు కీలక ఎపిసోడ్స్ హాలివుడ్ సినిమాలని గుర్తుచేస్తాయి.
నిర్మాణ విలువలు అత్యద్భుతం.ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కాజల్ సన్నివేశాల మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది
విశ్లేషణ :
స్పై థ్రిల్లర్స్ అనగానే హాలివుడ్ సినిమాలు ఓ పది గుర్తుకు వస్తాయి.ఆ తరహా సబ్జెక్ట్స్ ఎంచుకోవడంతోనే ప్రేక్షకుల అంచనా పెంచేస్తారు దర్శకనిర్మాతలు.కాని సినిమా ఇక్కడ థియేటర్ కి వచ్చే 30 రూపాయల ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ కావాలి కాబట్టి, స్పై కథల్లో కూడా ఎమోషన్స్ ని ఇరికించే ప్రయత్నాలు చేస్తారు మన ఫిలిం మేకర్స్.
దాంతో అవి ఉడికి ఉడికించని సినిమాలు అయిపోతాయి.వివేకం విషయంలో కూడా అదే జరిగింది.బేసిక్ గా సినిమాలో ఆసక్తికరమైన కథ, కథనాలు లేవు.ఎదో ఇంటలిజెంట్ సమస్యలు డీల్ చేస్తింది కూడా లేదు.
కాబట్టి ఎదో హాలివుడ్ డబ్బింగ్ సినిమాలో దక్షిణాది సినిమా కథ చూసినట్టు ఫీల్ అవుతారు ఆడియెన్స్
ఈ సినిమా ఖచ్చితంగా ఒక్కసారి అయినా చూడాలి.ఎందుకు అంటే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం.
అజిత్ కష్టం చూడ్డానికి, కెమెరా అద్భుత పనితనం చూడ్డానికి, ఫైట్ మాస్టర్ యొక్క ఆలోచనలు చూడ్డానికి, ఆ యాక్షన్ ఎపిసోడ్స్ కి న్యాయం చేసిన అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వినడానికి.టెక్నికల్ డిపార్ట్మెంట్ లో దర్శకుడు మరియు ఎడిటర్ మినహా, అందరు మంచి అవుట్ పుట్ ఇచ్చారు.
ప్లస్ పాయింట్స్ ;
* అజిత్ కుమార్
* కెమెరా వర్క్, సంగీతం
* యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ :
* పెద్దగా బుర్రకు పని చెప్పని కథ, కథనాలు
* తేలిపోయిన ఎమోషన్స్
* సరిగా లేని డబ్బింగ్ (తెలుగు వెర్షన్)
చివరగా :
యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడేవారి కోసం
రేటింగ్ : 2.75/5