ఖమ్మం: తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు.పర్యటనలో భాగంగా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెంలో ఉదయం 11:30 గంటలకు కొల్లు పకీరా రెడ్డి గారి దశదినకర్మలో పాల్గొంటారు.ఈ మేరకు పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.అదేవిధంగా మధ్యాహ్నం మూడు గంటలకు భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతి రావు చనిపోయినందున ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తారు.
అలాగే సాయంత్రం నాలుగున్నర గంటలకు కొత్తగూడెంలోని సీతారాంపురంలో ఎంపీటీసీ రుక్మిణి గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు.