పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన విజన్ మూవీ మేకర్స్ ‘అలా నిన్ను చేరి’

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో మారేష్ శివన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం ‘అలా నిన్ను చేరి’.హుషారు సినిమాతో సక్సెస్ కొట్టి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న దినేష్ తేజ్ హీరోగా.

 Vision Movie Makers Ala Ninnu Cheri Movie Launched Details, Viision Movie Makers-TeluguStop.com

హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో గురువారం ఘనంగా జరిగింది.

హీరో హీరోయిన్స్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మందడి కిషోర్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా.

మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు క్లాప్ కొట్టారు.ఈ కార్యక్రమానికి టీవీ 5 మూర్తి, హనుమంతరావు, కృష్ణా రావు, గరుడవేగ అంజి, హుషారు ఫేమ్ తేజస్‌లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

దర్శకత్వ బాధ్యతను మాత్రమే కాకుండా కథ, కథనం, మాటలు కూడా మారేష్ శివన్ అందించారు.రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభంకానుంది.

‘అలా నిన్ను చేరి’ సినిమాకు పాటలు చంద్రబోస్, సంగీతం సుభాష్ ఆనందన్ అందిస్తుండగా.పి.జి.వింద కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.ఆర్ట్ డైరెక్టర్‌గా విఠల్, క్యాస్టూమ్ డిజైనర్‌గా ముదసరా మహ్మద్ వ్యవహరిస్తున్నారు.ఈ చిత్రానికి కర్నాటి రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌.

ఈ చిత్రంలో దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ, శివ రామచంద్రవరపు, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు

కథ, కథనం, మాటలు, దర్శకత్వం : మారేష్ శివన్, నిర్మాత : కొమ్మాలపాటి సాయి సుధాకర్, సమర్ఫణ : కొమ్మాలపాటి శ్రీధర్, బ్యానర్ : విజన్ మూవీ మేకర్స్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌ : కర్నాటి రాంబాబు, సంగీతం : సుభాష్ ఆనందన్, డీఓపీ : పి.జి.వింద, ఆర్ట్ : విఠల్, పాటలు : చంద్రబోస్, క్యాస్టూమ డిజైనర్ : ముదసరా మహ్మద్, పీఆర్వో : సాయి సతీష్, పర్వతనేని రాంబాబు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube