అమెరికాలో పేరొందిన యూనివర్సిటీలలో రిఫరెన్స్ బుక్స్ గా తెలుగు కధల రచయితగా పేరొందిన ముఖ్యంగా శ్రీ తిరుమల తిరుపతీ వేంకటేశ్వరస్వామి పేరుతో రచించిన బుక్స్ ఉపయోగపడుతున్నాయని కొన్ని యూనివర్సిటీల ప్రొఫిసర్స్ అంటున్నారు.ప్రముఖ ఆద్యాత్మిక వేత్త, రచయిత అయిన టి.
వి.ఆర్.కే.మూర్తి అలియాస్ విశ్వపతి ఈ రచనలు చేస్తున్నారు.ఆయన రచనలకి పలు యూనివర్సిటీలలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
ఆయన రచించిన “శ్రీవారి దర్శన్” పుస్తకానికి అమెరికా ప్రొఫెసర్ల నుంచీ ప్రసంసల వర్షం కురుస్తోంది.ముఖ్యంగా “శ్రీవారి దర్శన్” ద్వారా తమకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయన్నారు.వారి విద్యార్థులకు ఆ విషయాలన్నీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని విశ్వపతిని ప్రసంస్తిస్తున్నారు.
హార్వర్డ్ యునివర్సిటీ ప్రొఫెసర్ ఫ్రాన్సిస్ క్లోని.కొలంబియా యునివర్సిటీకి చెందిన జాన్ స్ట్రాటన్ హాలే.యేల్ యూనివర్సిటీ అలెగ్జాండర్ కోస్కోకోవ్…ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ మదన్ లాల్ గోయల్.కొలరాడో ప్రొఫెసర్ లోరిలియా బీరేసిం.ప్రొఫెసర్ బ్రియాన్ట్ ఎడ్విన్కి ఇలా ఎంతో మంది ఆయన రచనలని కొనియాడారు.అయితే ఎంతో మంది తన రచనలని ఆదరించడం ఎంతో సంతోషంగా ఉందని విశ్వపతి తెలిపారు.