తనకు ప్రాణ హాని ఉందంటూ … తగిన భద్రత కల్పించాలని కోర్టును ఆశ్రయించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి హైకోర్టు ఆదేశాల మేరకు భద్రతను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది.రేవంత్‌రెడ్డికి 4 + 4 గన్‌మెన్లను కేటాయించింది పోలీసుశాఖ.
కొడంగల్‌లోని రేవంత్‌రెడ్డి నివాసానికి రెండు ఎస్కార్ట్ వెహికల్స్‌తో పాటు 4 + 4 గన్‌మెన్లను పంపించారు.పోలీసుశాఖ పంపించిన సెక్యూరిటీని రేవంత్‌రెడ్డి స్వీకరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజు వరకు రేవంత్‌రెడ్డికి 4 + 4 సెక్యూరిటీ కల్పించబోతున్నారు.తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ నిన్న ఎన్నికల ప్రచారాన్ని రేవంత్ రెడ్డి వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.తనకు భద్రత పెంచిన తర్వాతే ప్రచారానికి వెళ్తానని ప్రకటించారు రేవంత్ ఈ నేపథ్యంలో గన్‌మెన్లను పెంచడంతో తన ప్రచారం మొదలుపెట్టడానికి రేవంత్ సిద్ధం అవుతున్నారు.