మహేష్‌ను డైరెక్ట్ చేస్తానంటోన్న దాస్

యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవల హిట్ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.తన నెక్ట్స్ మూవీని కూడా ఇటీవల ప్రారంభించాడు ఈ హీరో.

 Vishwak Sen Wants To Direct Mahesh Babu, Vishwak Sen, Mahesh Babu, Hit Movie, Te-TeluguStop.com

పాగల్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు విశ్వక్ సేన్ రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా తరువాత తన తరువాత ప్రాజెక్ట్స్‌పై కూడా అప్పుడే ఫోకస్ప పెట్టాడు.

అయితే తనకు మరోసారి డైరెక్షన్ చేయాలని విశ్వక్‌కు ఉందట.గతంలో ఫలక్‌నుమా దాస్ చిత్రంతో తనలోని డైరెక్టర్‌ ట్యాలెంట్ మనకు చూపించాడు.కాగా ఇప్పుడు మళ్లీ తనలోని డైరెక్టర్‌కు పని చెప్పాలని ఉందట.అయితే ఈసారి ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబును హీరోగా పెట్టి సినిమా చేయాలని ఉందట ఈ హీరో కమ్ డైరెక్టర్‌కు.

మహేష్ అవకాశం ఇస్తే, ఆయన్ను తన కథతో మెప్పిస్తానని అంటున్నాడు విశ్వక్.

మరి మహేష్‌ను మెప్పించేంత సత్తా విశ్వక్‌కు ఉందా.? అతడి రెడీ చేయబోయే కథ ఎలాంటి జోనర్‌కు సంబంధించింది? అసలు మహేష్ విశ్వక్‌కు ఛాన్స్ ఇస్తాడా అనేది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube