యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) ఒకరు.అనతి కాలంలోనే విశ్వక్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టు కున్నాడు.
సినిమా సినిమాకు వేరియేషన్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాడు.అయితే ఈ యంగ్ హీరో ఈయన చుట్టూ ఉండే వివాదాల కారణంగా మరింత ఫేమస్ అయ్యాడు.
ఇక విశ్వక్ సేన్ ‘‘ధమ్కీ” సినిమా ( Dhamki Movie )తో హిట్ అందుకున్న తర్వాత వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టుకున్నాడు.విశ్వక్ సేన్ నెక్స్ట్ సినిమా ‘‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” ( Gangs Of Godavari )పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తోనే ఆకట్టుకున్న విశ్వక్ ఆ తర్వాత వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అదిరిపోయేలా అంచనాలు పెంచేసిందివిశ్వక్ ను మునుపెన్నడూ చూడని పవర్ఫుల్ లుక్ లో చూపించారు. కృష్ణ చైతన్య ( Krishna Chaitanya ) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా డిసెంబర్ 8నే రిలీజ్ అవ్వాల్సి ఉంది.
ప్రమోషన్స్ కూడా అదే రేంజ్ లో చేసి అంచనాలు పెంచేసుకున్న ఈ సినిమా సడన్ గా వాయిదా పడింది.
ఈ సినిమా షూటింగ్ లో ఆలస్యం కారణంగా విడుదల వాయిదా పడిందని టాక్.ఇంకా పది రోజుల షూట్ మిగిలి ఉందని కానీ విశ్వక్ సేన్ గాయపడడంతో షూటింగ్ వాయిదా పడిందని ఇప్పుడు ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చ్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.కాగా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.
యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.చూడాలి విశ్వక్ సేన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో.