ప్రస్తుతం తెలంగాణలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేయబోతున్నటువంటి బర్రెలక్క శిరీష ( Shirisha ) కు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పాలి.బర్రెలు కాస్తూ వీడియోలు చేయడంతో ఈమె బర్రెలక్కగా పేరు సంపాదించుకుంది.
ఇలా ఫేమస్ అయినటువంటి శిరీష తరచూ తన చానల్ ద్వారా ఎన్నో వీడియోలను అభిమానులతో పంచుకునేవారు అయితే తాజాగా ఈమె తెలంగాణ ఎన్నికలలో పోటీ చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి ఈమె తన ఫ్యామిలీ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.
తన తండ్రి తనని వదిలేసి వెళ్లిపోవడంతో తన తల్లి ఎంతో కష్టపడి తనని డిగ్రీ వరకు చదివించిందని అయితే ప్రభుత్వ ఉద్యోగం కొట్టడమే తన లక్ష్యంగా ఉన్నటువంటి శిరీషకు ఏ విధమైనటువంటి నోటిఫికేషన్లు వెలబడకపోవడంతో ఉద్యోగంపై విరక్తి చెందిందని అందుకే ఇలా బర్రెలు కాస్తున్నాను అంటూ ఈమె తన మొదటి వీడియోలో తెలియజేశారు.ఇక ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి నిరుద్యోగుల కోసం తాను పోరాటం చేస్తానని శిరీష తెలిపారు.

ఇక ఈమె తండ్రి వదిలేసాడు అంటూ తన ఫ్యామిలీ గురించి చెప్పడంతో ఈమె తండ్రి సోషల్ మీడియా వేదికగా కొన్ని వీడియోలను షేర్ చేశారు.ఈ క్రమంలోనే శిరీష గురించి కూడా ఈయన సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ సందర్భంగా శిరీష తండ్రి( Sirisha’s father ) మాట్లాడుతూ తన తల్లి కష్టపడి తనని చదివించిందని చెబుతుంది అయితే తాను చెప్పే మాటలను పూర్తిగా అబద్ధమని తనని నేనే చదివించానని అంతే కాకుండా శిరీషకి ఇదివరకే ఎంతో ఘనంగా వివాహం కూడా చేశానని శిరీష తండ్రి తెలిపారు.

ఇక ఈమె పెళ్లికి సంబంధించినటువంటి వివాహ పత్రికను ( wedding card )కూడా ఈయన ఆధారంగా చూపిస్తూ తనకు వివాహం జరిగిందని అప్పట్లోనే తమ కూతురు వివాహాన్ని ఎంతో ఘనంగా జరిపించానని కానీ తాను భర్తతో ఉండలేక తనని వదిలి వచ్చేసిందని తెలిపారు.అంతేకాకుండా ఇప్పుడు ఆమె కాస్తున్న బర్రెలు కూడా నేను కొనిచ్చినవేనని వారి బాధ్యతలని నేను నిర్వర్తించానని కానీ వాళ్లే నన్ను ఇంటి నుంచి బయటకు పంపించారు అంటూ ఈయన శిరీష గురించి ఎన్నో విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు.అయితే శిరీష తండ్రి తన గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
మరి శిరీష తండ్రి తన గురించి చేసినటువంటి మాటలు తనకు ఎన్నికలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతున్నాయని మరికొందరు భావిస్తున్నారు.ఏది ఏమైనా ఈమెకు పెళ్లి జరిగింది అనే విషయం వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.







