భారత జట్టు స్టార్ బ్యాటర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ( Rohit Sharma, Virat Kohli )లపై వెస్టిండీస్ మాజీ దిగ్గజం క్రిస్ గేల్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.అవి ఏమిటో చూద్దాం.
వన్డే వరల్డ్ కప్ లో రోహిత్, విరాట్ అద్భుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.విరాట్ కోహ్లీ 765 పరుగులతో వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
ఇక రోహిత్ శర్మ 597 పరుగులతో భారత జట్టుకు అదిరే ఆరంభాలు అందించాడని క్రిస్ గేల్ వీరిని ప్రశంసించాడు.

గత ఏడాది టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ లో భారత్ ఓటమి తర్వాత రోహిత్, కోహ్లీ టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉన్నారు.ప్రస్తుతం రోహిత్ శర్మ వయసు 36 ఏళ్ళు, విరాట్ కోహ్లీ వయసు 35 ఏళ్ళు.అయితే వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ లో వీళ్ళిద్దరూ ఆడతారా.
లేదా అనే విషయంపై సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్య చర్చ నడుస్తోంది.ఈ విషయంపై క్రిస్ గేల్( Chris Gayle ) స్పందిస్తూ.
వీరిద్దరూ భారతదేశం కోసం ఎంతో చేశారని, వాళ్లు ఆడాలనుకుంటే ఆడించడమే కరెక్ట్ అని, ఈ విషయంలో నిర్ణయం వాళ్ళిద్దరే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చాడు.

క్రిస్ గేల్ తన కెరీర్లో 483 మ్యాచ్లలో 553 సిక్సర్లు బాదితే.రోహిత్ శర్మ 462 ఇన్నింగ్స్ లలో 582 సిక్సర్లతో గేల్ రికార్డును బ్రేక్ చేసి, అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.రోహిత్ శర్మ ఎగ్రెసివ్ బ్యాటింగ్ అంటే తనకెంతో ఇష్టమని గిల్ తెలిపాడు.
ఇక విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ వన్డేల్లో 50 సెంచరీలు సాధించడం అంటే మామూలు విషయం కాదని, సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) లాంటి లెజెండరీ బ్యాటర్ రికార్డును బద్దలు కొట్టడం అంటే మాటలు కాదు అంటూ, విరాట్ కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పాడు.







