టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఒక పక్క సినిమాల్లో నటిస్తూ డైరెక్షన్ కూడా చేస్తున్నాడు.ఫలక్ నుమా దాస్ సినిమా తర్వాత విశ్వక్ దాస్ కా ధంకీ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో విశ్వక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.సినిమాలో కోలీవుడ్ భామ నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.
విశ్వక్ సేన్ ధంకీ సినిమా అసలైతే ఫిబ్రవరి 17న రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కుదరలేదు.ఇక లేటెస్ట్ గా ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 22న రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మార్చి 18 ఉగాది రోజున ప్లాన్ చేశారు.

విశ్వక్ సేన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ని తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నాడు.ఎన్.టి.ఆర్ అంటే విశ్వక్ కి చాలా ఇష్టం.చాలా సందర్భాల్లో తారక్ మీద తన అభిమానాన్ని చూపించాడు విశ్వక్ సేన్.
ఇక ఈసారి తన ఫంక్షన్ కి గెస్ట్ గా తారక్ ని పిలవాలని చూస్తున్నాడు.అయితే ఎన్.టి.ఆర్ అదే టైం లో ఆస్కార్ అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొనాల్సి ఉంది.మరి విశ్వక్ సేన్ ధంకీ ఈవెంట్ కి ఎన్.టి.ఆర్ వస్తాడా రాడా అన్నది తెలియాల్సి ఉంది.
.