రిలీజ్ కు అన్ని పనులు పూర్తి చేసుకున్న దాస్ కా 'ధమ్కీ'!

తనకంటూ స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్( Vishwak sen ) ఒకరు.అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టుకుని తెలుగు ప్రేక్షకుల మదిలో మంచి నటుడిగా తన టాలెంట్ ను పరిచయం చేసుకున్నాడు.

 Vishwak Sen Das Ka Dhamki Update Release Date Out Details, Vishwak Sen, Das Ka D-TeluguStop.com

ప్రెజెంట్ విశ్వక్ సేన్ తన మొదటి పాన్ ఇండియన్ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.

శ్వక్ సేన్ నటించిన పాన్ ఇండియన్ మూవీ ధమ్కీ( Dhamki ). భారీ బడ్జెట్ తో నిర్మాణ విలువలతో నిర్మించిన ఈ సినిమాకు విశ్వక్ సేన్ హీరో మాత్రమే కాదు డైరెక్టర్, నిర్మాత కూడా.అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో అని ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడీగా నివేదా పేతురాజ్( Nivetha Pethuraj ) హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై ఆసక్తి పెంచేసాయి.ఇక లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు కుమార్ బెజవాడ డైలాగ్స్ రాసారు.వన్మయే క్రియేషన్స్ మరియు విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ పై సంయుక్తంగా కరాటే రాజు నిర్మించారు.

మరి ఈ సినిమా రిలీజ్ కు సిద్ధం అయినా కూడా పలుసార్లు వాయిదా పడింది.ఇక ఎట్టకేలకు ఇటీవలే రిలీజ్ డేట్ ఫైనల్ చేసారు.

మేకర్స్ అధికారికంగా ధమ్కీ సినిమాను మార్చి 22న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ధమ్కీ సినిమా అన్ని పనులు శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.తాజాగా ఈ సినిమా లాస్ట్ మిక్సింగ్ ని కంప్లీట్ చేసినట్టు మేకర్స్ అఫిషియల్ గా తెలిపారు.దీంతో ఈసారి రిలీజ్ పక్కా అని తెలుస్తుంది.చూడాలి మరి ఈ సినిమా దాస్ కా మాస్ కెరీర్ కు ఎలా యూజ్ అవుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube