యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen ) ఒకరు.అనతి కాలంలోనే విశ్వక్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి తన నటనతో యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.
సినిమా సినిమాకు వేరియేషన్స్ తో ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాడు.ఈ యంగ్ హీరో సినిమాలతోనే కాదు వివాదాలతో కూడా ఫేమస్ అయ్యాడు.
అప్పుడప్పుడు ఈయన చుట్టూ ఉండే వివాదాల కారణంగా ఈయన మరింత ఫేమస్ అయ్యాడు.ఇక ఈ యంగ్ హీరో ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.అయితే ఈయన ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అనే రూమర్స్ గత కొద్దీ రోజులుగా వైరల్ అవుతుండగా ఇప్పుడు ఈయన ఎంట్రీ కన్ఫర్మ్ అయ్యింది.తెలుగు ఓటిటి స్ట్రీమింగ్ యాప్ ఆహా( Aha ) లో ఈయన డెబ్యూ ఇవ్వనున్నాడు.
ఈ వేదికపై విశ్వక్ ఒక షోకు హోస్ట్ గా చేస్తున్నట్టు తాజాగా కొద్దిసేపటి క్రితం రివీల్ చేసారు.ఈసారి మాస్ కా దాస్ ఫ్యామిలీ మాన్ గా మారిపోయి ఫ్యామిలీ ఆడియెన్స్ ను అలరించడానికి సిద్ధం అయ్యాడు.”ఫ్యామిలీ ధమాకా”( Family Dhamaka ) అనే ఇంట్రెస్టింగ్ షోకు హోస్ట్ గా చేయనున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.అతి త్వరలోనే స్ట్రీమింగ్ కాకున్నా ఈ షో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక విశ్వక్ సినిమాల విషయానికి వస్తే.ధమ్కీ హిట్ తర్వాత మరో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు.అందులో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ( Gangs Of Godavari ) ఒకటి.కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.