టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ యాంకర్లలో విష్ణుప్రియ( Vishnu Priya ) ఒకరు కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ పలు టీవీ షోల ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు.యూట్యూబ్ కవర్ సాంగ్స్ ఆమెకు మరింత పాపులారిటీని తెచ్చిపెట్టాయి.ఇన్ స్టాగ్రామ్ లో విష్ణుప్రియకు 1.2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.తాజాగా విష్ణుప్రియ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
జలుబు, జ్వరంతో ( cold and fever) బాధ పడుతున్నా పొట్టకూటి కోసం నేను కష్టపడాల్సి వస్తోందని ఆమె తెలిపారు .అందుకోసమే రిహార్సల్స్ చేస్తున్నానని ఆమె కామెంట్లు చేశారు.నా ఫ్యాన్స్ లవ్ వల్లే నేను ఇదంతా చేయగలుగుతున్నానని వాళ్ల ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోందని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు.దైవ భక్తి ఎక్కువగా ఉన్న విష్ణుప్రియ ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించడం ద్వారా కూడా వార్తల్లో నిలుస్తున్నారు.

విష్ణుప్రియ సినిమాలపై ఫోకస్ పెడితే ఆమె కెరీర్ బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.విష్ణుప్రియ పారితోషికం పరిమితంగానే ఉండగా జాగ్రత్తగా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటే మరిన్ని విజయాలు ఆమె సొంతమవుతాయని చెప్పవచ్చు.అభిమానులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే విష్ణుప్రియ కెరీర్ ను ఎలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.విష్ణుప్రియ ఫ్యాన్ ఫాలోయింగ్ ను మాత్రం పెంచుకుంటున్నారు.

చాలామంది సెలబ్రిటీలు( Celebrities ) తమకు వచ్చిన క్రేజ్, పాపులారిటీని సద్వినియోగం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు.సెలబ్రిటీలు వరుసగా వచ్చిన ప్రతి ఆఫర్ ను వినియోగించుకుంటే ఆలస్యంగానైనా కోరుకున్న సక్సెస్ దక్కుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.విష్ణుప్రియ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది.విష్ణుప్రియ పలు సినిమాలలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.







