ఒకవైపు బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి నేడు వెళ్తుండగానే బిజెపి మాత్రం ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది.ఏపీలో ఉన్న 25 లోక్ సభ ,175 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు ముందుగానే సిద్ధం అవుతోంది.
ఈ మేరకు నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను నిన్ననే పార్టీ అధిష్టానానికి ఏపీ బీజేపీ నేతలు పంపించారు .జాతీయ పార్టీ సహా సంఘటన కార్యదర్శి శివ ప్రకాష్( Shiv Prakash ) విజయవాడలో శని, ఆదివారాలలో జిల్లాల వారీగా పార్టీ అధ్యక్షులు, కన్వీనర్లు ,ముఖ్య నేతలతో వేరువేరుగా సమావేశాలు నిర్వహించారు.
రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ తరఫున పోటీ చేసే నాయకుల పేర్లతో జాబితాలను రూపొందించారు .ప్రతి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇద్దరు లేదా ముగ్గురు చొప్పున, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురు తక్కువ కాకుండా పేర్లతో నివేదికను సిద్ధం చేసి ఢిల్లీకి పంపించినట్లు సమాచారం.లోక్ సభ అభ్యర్థుల తుది ఎంపికకు సంబంధించి బిజెపి ఏపీ నేతలతో కేంద్ర బీజేపీ పెద్దలు సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఆ తర్వాతే అభ్యర్థుల ప్రకటన పై ఒక క్లారిటీకి రానున్నారు .ఈ రోజు టిడిపి అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ ( Chandrababu , Pawan Kalyan )ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయిన తర్వాత , టిడిపి జనసేన బిజెపి కలిసి పోటీ చేసే విషయంలో ఒక క్లారిటీ రానుంది.
బిజెపి టిడిపి జనసేన పొత్తుపై అధికారికంగా ఇంకా ఏ ప్రకటన రాలేదు .పొత్తులో భాగంగా బిజెపికి కేటాయించే సీట్ల విషయంలో ఇప్పటికే టిడిపి లీకులు ఇస్తోంది.పొత్తులపై బీజేపీ అగ్రనేత నిర్ణయం వెలువడిన తరువాతే దీనిపై మరింత క్లారిటి రానుంది.
గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తుల విషయమై టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ( Amit Shah )తో భేటీ అయ్యారు.పొత్తుల విషయమై చర్చించారు.
కానీ అప్పటి నుంచి బీజేపీ పెద్దలు తమ నిర్ణయం ఏమిటి అనేది తేల్చడం లేదు.దీంతో టీడీపీ, జనసేన పార్టీలు ఈ విషయంలో కన్ఫ్యుజ్ అవుతున్నాయి.