కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి నటుడు విషయాలు తెలుగులో కూడా అదే స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఈయన నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి.
ఇలా నటుడుగా తెలుగు తమిళ భాషలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈయన రాజకీయాల పరంగా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారనే సంగతి మనకు తెలిసిందే. విశాల్( Vishal ) నటన పరంగా సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా ఈయన పలు సందర్భాలలో తమిళ రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ ఉంటారు.అయితే తాజాగా ఏపీ రాజకీయాల ( Ap Politics )గురించి విశాల్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.త్వరలోనే ఏపీలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈయన ఏపీ సీఎం( Ap Cm ) ఎవరనే విషయం గురించి కామెంట్స్ చేశారు.విశాల్ నటించిన రత్నం అనే సినిమా ఏప్రిల్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ క్రమంలోనే తెలుగులో కూడా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఈయన హైదరాబాద్ రాగా ఏపీ ఎన్నికల గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఏపీలో జరగబోయే ఎన్నికలలో మరోసారి జగన్ విజయం సాధిస్తారని ఏపీ ముఖ్యమంత్రి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy ) అవుతారు అంటూ ఈయన కామెంట్లు చేశారు.ఇదివరకు జగనన్న పై ఎన్నో దాడులు జరిగాయని వాటన్నింటిని ఆయన ఎదుర్కొన్నారని తెలిపారు.
అయితే తాను ఏ పార్టీకి మద్దతు తెలపడం లేదని జగనన్న అంటే నాకు చాలా అభిమానం అంటూ విశాల్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.