తమిళ రాజకీయాల్లో కొత్త రాజకీయ సమీకరణాలు వేగంగా జరుగుతున్నాయి.రజనీ ఇప్పటి వరకూ ఎవరినీ పార్టీలోకి ఆహ్వానిచింది లేదు అయితే తమకు తాముగానే రజనీ పార్టీలోకి వెళ్ళడానికి కోలివుడ్ తారలు తహతహలాడుతున్నారు ఎంతో మంది ప్రముఖులు కూడా రజనీ పార్టీలోకి రావాలని చూస్తున్నారట.
అయితే రజనీ నుంచీ స్పష్టమైన ప్రకటన రాగానే విద్యావేత్తలు కూడా.స్వచ్చంద సంస్థల అధినేతలు కూడా రజనీ కోసం ప్రచారం చేస్తాము అంటున్నాయి.
అయితే రజనీకాంత్ పార్టీ ప్రకటన్ చేసి తరువాత వెబ్సైటు కూడా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే అయితే ఒక్క రోజులోనే లక్షల సంఖ్యలో ఆ వెబ్సైటు కి రజనీ అభిమానులు మద్దతు పలికారు.ఇప్పటికి ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
దీంతో రజినీకి సపోర్ట్ గా కోలీవుడ్ సినీ ప్రముఖులు కూడా నిలుస్తున్నారు.ఇటీవల రాఘవ లారెన్స్ రజినీకి మద్దతు ఇస్తానని చెప్పాడు…అంతేకాదు లారెన్స్ కి ఉన్న మాస్ ఆదరణ, సేవా కార్యక్రమాల కోణంలో తనకి ఎమ్మెల్యే గా అవకాశం కలిపిస్తారు అని తెలుస్తోంది.
అయితే ఇప్పుడు మరొక హీరో లారెన్స్ తరహాలో రజనీకి మద్దతు ఇచ్చాడట అతేనేవరో కాదు ఆర్.కే.నగర్ ఉపెన్నికల్లో నామినేషన్ వేసిన హీరో విశాల్.రజినీ పార్టీ పోటీ చేస్తే 234 స్థానాల్లో ప్రచారం చేస్తానని విశాల్ తెలిపాడు.
ఒక కార్యకర్తగా మాత్రమే పనిచేస్తాను అని వివరించాడు.అయితే మరి రజనీ విశాల్ కోరికకి ఒకే చెప్తాడా లేదా దూరం పెడుతాడా అనేది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా సరే రజనీ కాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడు ఒక ప్రభంజనం సృష్టిస్తోంది.ఇంకెంత మంది సీనీతారాలు రజనీకాంత్ కి మద్దతు తెలుపుతారో వేచి చూడాలి.