పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

నిన్న జనసేనాని నిర్వహించిన మూడో విడత వారాహి యాత్రలో భాగంగా ఆయన రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ అభియోగాలు దాఖలు అయ్యాయి.

ఈ మేరకు విశాఖ తూర్పు ఏసీపీ పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేశారని సమాచారం.మరోవైపు పవన్ రుషికొండ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు.

ఇందులో భాగంగా పవన్ వాహనంతో పాటు మరో ఏడు వాహనాలకు మాత్రమే అనుమతిని ఇచ్చారు.అయితే పోలీసులు అనుమతించకపోయిన రుషికొండను సందర్శిస్తానని పవన్ చెప్పిన విషయం తెలిసిందే.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు