ఈ ఐపీఎల్ సీజన్-16( IPL Season-16 ) ఉత్కంఠ భరితంగా సాగుతూ నువ్వా నేనా అంటూ సాగుతూ ప్రత్యక్షంగా చూసే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.ఈ క్రమంలో ఢిల్లీ జట్టు( Delhi Team ) వరుస ఓటములను ఖాతాలో వేసుకుంటూ లీగ్ పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఢిల్లీ జట్టు ఇంకా బోణి కొట్టలేదు.అయితే ఢిల్లీ జట్టు ఓటమిపై భారత మాజీ ఆటగాడైన వీరేంద్ర సెహ్వాగ్( Virender Sehwag ) కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ( Saurabh Ganguly ), ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ లే( Ricky Ponting ) ఢిల్లీ ఓటమి బాధ్యత తీసుకోవాలని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.ఒక జట్టు గెలిచిన, ఓడిన పూర్తి బాధ్యత కొచ్ లదే.ఢిల్లీ జట్టుకు ప్రధాన కోచ్గా ఉన్న రికీ పాంటింగ్ గత సీజన్లో బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తిస్తూ ఢిల్లీ జట్టును ఫైనల్ కు చేర్చాడు.ప్రతి సంవత్సరం ఢిల్లీ జట్టు లే ఆఫ్ కు చేరడంలో రికీ పాంటింగ్ కీలక పాత్ర పోషించాడు.
అయితే జట్టు గెలిచినప్పుడు క్రెడిట్ తీసుకోవాలి, జట్టు ఓడినప్పుడు కూడా ఓటమి బాధ్యత తీసుకోవాలి.ఇదేమి భారత క్రికెట్ జట్టు కాదు.ఎవరైనా కూడా తమ జట్టే గెలవాలని కోరుకుంటారు.గెలిస్తే గొప్పలు చెప్పుకుంటారు లేదంటే నిందిస్తారు.ఐపీఎల్ లో కోచ్ పాత్ర ఏమి ఉండకపోయినా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కోచ్ ల యొక్క ప్రధాన లక్ష్యం అని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.ఈ ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ జట్టు జరిగిన మ్యాచ్లలో రాణించలేకపోయింది.
తదుపరి మ్యాచ్లలో ఢిల్లీ జట్టు ఆట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు.