కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు హైదరాబాద్ కు తరలించారు.ఈ మేరకు మరికాసేపటిలో సీబీఐ జడ్జి ముందు ఆయనను హాజరు పరచనున్నారు.
ముందుగా ఉస్మానియా ఆస్పత్రిలో వైఎస్ భాస్కర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.అనంతరం సీబీఐ న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చనున్నారు అధికారులు.
కాగా మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా భాస్కర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.







