రానా, సాయి పల్లవి జంటగా వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న సినిమా విరాటపర్వం.జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ చేశారు.1990 లో ఉత్తర తెలంగాణాలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా విరాటపర్వం సినిమా తెరకెక్కించారు.సినిమాలో కామ్రెడ్ రవన్న పాత్రలో రానా నటించారు.
సినిమాలో సాయి పల్లవి పాత్ర కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు.అంతేకాదు ప్రియమణి కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు.
ఈ నెల 3వ వారం లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ని జూన్ 5న రిలీజ్ ఫిక్స్ చేశారు.విరాటపర్వం సినిమాపై రానా చాలా హోప్స్ పెట్టుకున్నారు.
ఈ ఇయర్ మొదట్లోనే భీమ్లా నాయక్ తో హిట్ అందుకున్న రానా విరాటపర్వం సినిమాతో మరో హిట్ కొట్టాలని చూస్తున్నారు.రానా, సాయి పల్లవిల జోడీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.
వరుస హిట్ సినిమాలతో దూసుకెళ్తున్న సాయి పల్లవి విరాటపర్వంతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది.ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర బ్యానర్ లో సుధాకర్ చెరుకూరి నిర్మించారు.
సురేష్ ప్రొడక్షన్ సమర్పించడం విశేషం.







