కోలు కోలు.. సాంగ్ తో మరోసారి అదరగొడుతున్న సాయి పల్లవి..

ఫిదా సినిమాతో తెలుగులో పరిచయమయి ప్రేక్షకులను ఫిదా చేసింది సాయి పల్లవి.అందం, అభినయం, డాన్స్ ఇలా ప్రతి విషయంలో సాయి పల్లవికి సాటి మరే హీరోయిన్ రాదు.

 Virataparvam Movie Kolu Kolu Song Released Today, Virataparvam, Kolu Kolu Song,-TeluguStop.com

చేసింది కొన్ని సినిమాలు అయినా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దు గుమ్మ.కథ నచ్చక పోతే ఎంత పెద్ద హీరో సినిమా అయినా నో అని చెప్పడం ఈ అమ్మడి స్టైల్.

ప్రస్తుతం సాయి పల్లవి వరస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో కలిసి నటిస్తుంది.

ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.అయితే రానా దగ్గుబాటి తో కలిసి చేస్తున్న సినిమా విరాటపర్వం.

వేణూ ఊడుగుల దర్శకత్వంలో ఈ సినిమా తేరకెక్కుతుంది.

Telugu Kolu Kolu, Rana, Sai Pallavi, Tollywood, Virataparvam-Movie

ఈ సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్ పతాకంపై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ఫస్ట్ లుక్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేసాయి.అయితే ఈ సినిమా నుండి ఒక పాటను రిలీజ్ చేసారు.

ఈ పాటతో మరోసారి సాయి పల్లవి ప్రేక్షకులను కట్టి పడేస్తుంది.

కోలు కోలు.

అంటూ సాగే ఈ పాటను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు వెంకటేష్ చేతుల మీదుగా రిలీజ్ చేసారు.జానపద పాట లాగా సాగే ఈ పాటను అందమైన ప్రకృతి మధ్య తెరకెక్కించారు.ఈ సినిమాలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటిస్తుంది.1990 లో నక్సల్స్ ఉద్యమాలు ఎలా ఉండేవన్న అంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

రెవల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.నక్సల్ రవన్న అలియాస్ డాక్టర్ రవిశంకర్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది.ఈ సినిమా ఏప్రిల్ 30 న రిలీజ్ కాబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube