కొన్న కార్లను అమ్మేసుకున్న విరాట్ కోహ్లీ... ఎందుకంటే?

ఏంటి నమ్మట్లేదా? మీరు ఇక్కడ చదివింది నిజమే.టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్( Virat ) ఆటతీరు గురించి చెప్పనక్కర్లేదు.

 Virat Kohli Sold The Cars He Bought Because ,team India Cricketer, Virat Kohli,-TeluguStop.com

తనదైన ఆటతీరుతో విరాట్ ఒక సినిమా సెలెబ్రిటీ వలె ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.యావత్ ప్రపంచమంతటా విరాట్ క్రికెట్ కి అభిమానులు వున్నారు.

అయితే ఈ క్రికెట్ దిగ్గజం ఎన్నో కార్లు కొని అమ్మేశానంటూ తాజాగా ఓ మీడియా వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.సెలబ్రిటీ హోదాతో పాటు వచ్చే కోట్ల డబ్బును అనవసరంగా ఖర్చు చేసిన తర్వాత అలా చేయడం సరికాదని తెలుసుకున్నట్లు ఈ సందర్భంగా విరాట్ చెప్పుకొచ్చాడు.

Telugu Cricket, Cricketer, Luxury Cars, India, India Cricketer, Virat Kohli-Late

విరాట్ కోహ్లి( Virat Kohli ) రోజూ కోట్లల్లో సంపాదిస్తూ ఉంటాడు.అందుకు తగినట్లే ఎన్నో లగ్జరీ కార్లు( Luxury cars ) కొనడం కూడా సహజమే.అయితే విరాట్ మాత్రం తాను ఎన్నో కార్లను కొని అమ్మేసినట్లు చెప్పి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.చేతిలో డబ్బు ఉంది కదా అని పెద్దగా ముందు చూపుతో ఆలోచించకుండా కార్లు కొనేవాడినని, ఇప్పుడు వాటన్నింటినీ అమ్మేసినట్లు చెప్పాడు.

ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తన టీమ్ రాయల్ ఛాలెంజర్స బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ ఫొటోషూట్ లో విరాట్ పాల్గొన్నాడు.అటు కెమెరాకు పోజులిస్తూనే ఇటు ఓ ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు.

Telugu Cricket, Cricketer, Luxury Cars, India, India Cricketer, Virat Kohli-Late

ఈ సందర్భంగా విరాట్ అనేక విషయాలను గురించి చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో తన అభిమాన క్రికెటర్లు, చిన్ననాటి సంగతులను కూడా కోహ్లి పంచుకున్నాడు.ఆర్సీబీ యూట్యూబ్ ఛానెల్ ఈ ఇంటర్వ్యూను పోస్ట్ చేయగా అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ సందర్భంగా విరాట్ కార్ల గురించి మాట్లాడుతూ… “నేను వాడిన చాలా కార్లు ముందు చూపు లేకుండా కొన్నవే.

కానీ వాటిని నేను పెద్దగా నడిపింది లేదు.కానీ ఓ సమయం వచ్చిన తర్వాత అనవసరంగా కొన్నాను అని ఫీల్ అయి వాటిలో చాలా వాటిని అమ్మేశాను.

ఇప్పుడు మాకు కచ్చితంగా అవసరం అనిపించేవే వాడుతున్నాను.ఏవి అవసరం ఏవి కాదు అని తెలుసుకునే పరిణతి వచ్చిన తర్వాత అనవసరమైన కార్లను అమ్మేశాను” అని కోహ్లి ఈ సందర్భంగా చెప్పడంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube