వెస్టిండీస్-భారత్( Ind vs WI ) మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి( Virat Kohli ) 500 వ అంతర్జాతీయ మ్యాచ్ అని తెలిసిందే.ఈ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీ చేసి మ్యాచ్ ను ఒక తీపి జ్ఞాపకార్థంగా మిగులుచుకున్నాడు.
అయితే విరాట్ కోహ్లీ 2018 డిసెంబర్లో ఆసియా పై సెంచరీ చేశాడు.ఆ తర్వాత సెంచరీ నమోదు చేయడానికి ఇంత కాలం పట్టింది.
కోహ్లీ టెస్టు కెరియర్ చూసుకుంటే ఇప్పటివరకు 29 సెంచరీలు చేశాడు.అందులో విదేశాలలో 15 సెంచరీలు కొట్టాడు.
రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ.సెంచరీ ( Century ) సాధించడానికి దాదాపు ఐదేళ్ల కాలం పట్టిందని చెబుతున్నారు.
ఇది మాట్లాడుకోవడానికి బాగుంటుంది.తాను సొంత గడ్డపై కంటే విదేశాలలోనే ఎక్కువ సెంచరీలు నమోదు చేశారని గుర్తు చేశాడు.
గత నాలుగున్నర సంవత్సరాల నుండి విదేశాలలో ఎక్కువ మ్యాచులు జరగలేదని చెబుతూ.తన ఖాతాలో ఎక్కువగా అర్థ సెంచరీలు ఉన్నాయని తెలిపాడు.

తాను సొంత రికార్డుల కోసం కాకుండా జట్టు విజయం కోసం తన నుంచి కావాల్సిన సహకారం అందించేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తానని తెలిపాడు.ఏదైనా మ్యాచ్లో 50 కి పైగా పరుగులు చేసి అవుట్ అయితే సెంచరీ మిస్ అయిందని కచ్చితంగా బాధపడతానని చెప్పాడు.అదే 120కి పైగా పరుగులు చేసి అవుట్ అయితే డబుల్ సెంచరీ మిస్ అయిందని బాధపడతానని తెలిపాడు.తన క్రికెట్ కెరియర్ లో ఎన్నో మైలురాళ్లను చూశానని తెలిపాడు.

ప్రస్తుతం తనకు చెప్పలేని సంతోషం ఉందని భారత తరఫున అంతర్జాతీయ స్థాయిలో 500 మ్యాచులు( 500 Matches ) ఆడడం గర్వంగా ఉందని అన్నాడు.తనకు ఏ ఫార్మాట్లో అయినా అద్భుత ఆట ప్రదర్శించే సత్తా ఉందని తెలిపాడు.ఇక టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే తొలి టెస్టులో భారత బౌలర్ల ధాటికి వెస్టిండీస్ చిత్తుగా ఓడిపోయింది.రెండో టెస్ట్ మ్యాచ్లో మాత్రం కాస్త గట్టిగానే పోటీ ఇస్తోంది.
భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 438 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది.రెండో రోజు తన మొదట ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ను కోల్పోయి 86 పరుగులు చేసింది.