హైదరాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది.రేపు సాయంత్రం జరిగే ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనతో పాటు బస్సు యాత్ర, పార్టీలో చేరికలు వంటి అంశాలపై నేతలు ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది.
కాగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా పాదయాత్రలతో పాటు భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు.