వైరల్: అదృష్టం... బీచులో కొట్టుకుపోయి 80 కి.మీ దూరంలో ప్రాణాలతో బయటపడింది!

సోషల్ మీడియా అనేది ఇపుడు జనాలను శాసిస్తోంది అని చెప్పుకోవచ్చు.ఎంతలా అంటే.

ప్రతీ నిముషానికి ఇక్కడ లక్షల సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ అవుతూ ఉంటుంది.అయితే ఇందులో కొన్ని మాత్రమే జనాలను ఆకర్షిస్తాయి.

దాంతో ఆయా కంటెంట్ వైరల్ అవుతూ ఉంటుంది.ఈ నేపథ్యంలో కొన్ని జనాలకి ఫన్నీగా అనిపిస్తే, మరికొన్ని బాధని కలిగిస్తూ ఉంటాయి.

కొన్నిటిని చూసినపుడు అయ్యో పాపం అనిపిస్తే మరికొన్ని వీడియోలను చూసినపుడు వీరికి భూమిపై నూకలు మిగిలాయిరా అనిపిస్తుంది.తాజాగా అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం గమనించవచ్చు.

Advertisement

జపాన్‌లోని( Japan ) షిమోడా నగర బీచ్‌ సాక్ష్యంగా జరిగిన ఓ సీన్ జనాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.వివరాల్లోకి వెళితే.చైనాకు చెందిన 20 ఏళ్ల యువతి టూర్ కోసం జపాన్‌కు వెళ్ళింది.

టూర్‌లో భాగంగా గత సోమవారం రోజు షిమోడా నగరానికి వచ్చి అక్కడి అందమైన బీచ్‌కు వెళ్ళింది.తరువాత స్విమ్మింగ్ రింగు ధరించి ఈత కొట్టేందుకు బీచ్‌లోని సముద్ర జలాల్లోకి అత్యంత ఎత్తునుండి దూకింది.

ఈ క్రమంలో కాసేపు ఆమె సేఫ్‌గానే ఈత కొట్టింది.తర్వాత అకస్మాత్తుగా ఆటుపోట్లు బీచ్‌ను ముంచెత్తడంతో ఆ ఆటుపోట్లలో ఆ చైనీస్ యువతి( Chinese Woman ) కొట్టుకుపోయింది.

అనంతరం అక్కడే ఆమె ఫ్రెండ్ ఒకరు జపాన్ కోస్ట్ గార్డ్ దళానికి కాల్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది.

నైజాంలో కంగువకు భారీ షాక్.. పుష్ప ది రూల్ కు సైతం ఇబ్బందులు తప్పవా?
రీల్స్ పిచ్చి తగలయ్య.. బైక్ పై మరో బైక్ ఉంచి యువకుల సాహసాలు..

దీంతో జపాన్ కోస్ట్ గార్డ్ దళాలు రెస్క్యూ ( Rescue ) రంగంలోకి దిగి ఆపరేషన్‌ను మొదలు పెట్టాయి.కట్ చేస్తే.సోమవారం రాత్రి షిమోడా బీచ్‌లో గల్లంతైన సదరు యువతి 37 గంటల తర్వాత 80 కిలోమీటర్ల దూరంలోని బోసో ద్వీపకల్పపు దక్షిణపు కొనలోని సముద్ర జలాల్లో ప్రాణాలతో కనిపించింది.

Advertisement

అదృష్టం ఏమిటంటే.స్విమ్మింగ్ రింగు ఆమె ప్రాణాలను కాపాడడం విశేషం.అయితే ఆమె స్పృహలో లేదు.

బుధవారం తెల్లవారుజామున ఓ కార్గోషిప్ డ్రైవర్లు ఆమెను సముద్రంలో గుర్తించి అటువైపుగా వెళ్తున్న ఓ ఎల్పీజీ ట్యాంకర్ షిప్‌కు సమాచారాన్ని అందించారు.ఆ షిప్పులోని ఇద్దరు సిబ్బంది సముద్రంలోకి దూకి ఆ యువతిని రక్షించారు.

అనంతరం జపాన్ కోస్ట్ గార్డ్‌ హెలికాప్టరును పంపించి.ఆమెను ఆస్పత్రిలో చేర్పించింది.

ఆ రకంగా ఆమె బతికిబట్టగలిగింది.

తాజా వార్తలు