వైరల్: ప్రాణం మీదికి తెచ్చిన వెడ్డింగ్ షూట్..!

పెళ్లి అంటేనే ఒక జ్ఞాపకం.ఆ జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచుకోవడానికి పెళ్లికి సంబంధించిన ఏ విషయం అయినా ఫోటోలు, వీడియోల రూపంలో దాచుకుంటూ ఉంటారు.

అయితే పెళ్లికి ముందే లక్షల్లో ఖర్చు పెట్టి మరి ఈ ఫోటోలు వీడియోలు చేయించుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది.పెళ్లి కంటే ఎక్కువగా ఫోటో షూట్ల గురించే ఆలోచిస్తున్నారు కాబోయే దంపతులు.

అందుకోసం రకరకాల ప్రదేశాలు తిరుగుతూ, వినూత్న రీతిలో ఫోటోలు దిగుతూ పెళ్లి వేడుకలు చేసుకుంటున్నారు.అయితే కొన్ని జంటలు మాత్రం ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ పేరుతో రకరకాల ప్రదేశాలకు వెళుతూ రిస్క్ లో పడుతున్నారు.

కొండలు, గుట్టలు అంటూ ఎక్కడపడితే అక్కడ ఫోటోలు దిగుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.అయితే తాజాగా ప్రీ వెడ్డింగ్ షూట్ కి వెళ్లి ఓ జంట ప్రమాదం బారిన పడింది.ఈ సంఘటన రాజస్థాన్ లో చోటు చేసుకుకుంది.

Advertisement

చిత్తోర్ గఢ్ లోని రావత్ భటా ప్రాంతంలో చులియా జలపాతం వద్ద పెళ్లి చేసుకోబోయే ఓ జంట ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగంగా నదీ జలపాతం మధ్య లోకి వెళ్లారు.అక్కడ రాళ్ల పై కూర్చొని ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో జలపాతం పై ఉన్న డాం గేట్లు ఎత్తేయడంతో ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగింది.

దీంతో వధూవరులు, వారితో పాటు ఉన్న ఇద్దరు సహాయకులు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు.

అప్పటికి ఫోటోగ్రాఫర్ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి వారిని బయటికి రావాలని వారించినా వారు పట్టించుకోలేదు.అతడి మాటలు పక్కన పెట్టి అక్కడే ఉండిపోయారు.దీంతో కొన్ని సెకండ్ల వ్యవధిలోనే నీటి ప్రవాహం ఎక్కువై వారు నిలుచున్న బండ చుట్టూ నీరు చేరి పోయి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

అయితే జలపాతం నుంచి బయటకు వచ్చిన ఫోటోగ్రాఫర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.దాదాపు మూడు గంటల పాటు శ్రమించి కాబోయే దంపతులను కాపాడారు.

చిరంజీవి నెక్స్ట్ ఈ దర్శకులతోనే సినిమాలు చేయనున్నారా..?
Advertisement

తాజా వార్తలు