Omelette Viral Video : వైరల్ వీడియో: ఈమధ్య ఆమ్లెట్లను ఇలా కూడా చేసేస్తున్నారా.?! ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి..!

సోషల్ మీడియా పెరిగిన తర్వాత రోజు అనేక రకాల వీడియోలు తెగ వైరల్ అవ్వడం మనం గమనిస్తూనే ఉంటాం.తాజాగా ఓ మహిళ ఆమ్లెట్( Omelette ) తయారు చేసిన విధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Viral Video Woman Uses Threads To Flip Omelette-TeluguStop.com

ఇంట్లో ఆమ్లెట్లు చేస్తున్న సమయంలో ఎదుర్కొనే ఇబ్బందులకు పరిష్కారంగా ఈ వీడియో పనికి వస్తుందంటూ ఈ వీడియోను చూసిన నెటిజన్స్ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

ఆమ్లెట్ వేసేటప్పుడు ఎలాంటి స్పూన్లు, గరిటలు లాంటివి అవసరం లేకుండానే కేవలం దారాల సహాయంతో( Threads ) ఒక సైడ్ నుంచి మరో సైడ్ కు తిప్పుకునే విధంగా ఉండడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా( Viral ) మారింది.ఇంతకీ ఈ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.

ముందుగా ఓ మహిళ గ్యాస్ స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆ తర్వాత రెండు పొడవాటి దారాలను తీసుకొని వాటిని ఆమె పెట్టిన ప్యాన్ పై ఎక్స్ ఆకారంలో ఉంచింది.

ఆ తర్వాత ఆమె రెడీ చేసుకున్న కోడిగుడ్ల మిశ్రమాన్ని ఆ ప్యాన్ పై పోసింది.దీంతో కొద్ది సెకండ్లలోనే ప్యాన్ పై ఉన్న కోడిగుడ్ల మిశ్రమం కాస్త కాలిన తర్వాత ఆమ్లెట్లను తిప్పడానికి( Flip Omelette ) ఎలాంటి గరిటను ఉపయోగించకుండా., ఆమె పెట్టిన రెండు దారాలను ఉపయోగించి ఆమ్లెట్ ని ఒకవైపు నుండి మరోవైపుకి అతి సులువుగా తిప్పేసింది.

ఆ తర్వాత ఇంకేముంది ఆ దారాలను ఎంచక్కా పక్కన పెట్టేసింది.

ఈ వీడియో చూసిన తర్వాత నెటిజెన్స్ కామెంట్ల రూపంలో వీడియోని వైరల్ చేస్తున్నారు.ఇన్ని రోజులు ఆమ్లెట్ విరిగిపోతుందని బాధపడుతున్న వారందరికీ ఇలాంటి అద్భుతమైన పరిష్కారం చూపించినందుకు ధన్యవాదాలు అంటూ సదరు మహిళలకు కృతజ్ఞతలు తెలిపేస్తున్నారు.మరి కొందరైతే మీలాంటి టాలెంట్ వ్యక్తుల కోసం నాసా ఎదురుచూస్తుందని కాస్త ఫన్నీగా కామెంట్లు కూడా చేస్తున్నారు.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వైరల్ వీడియోను చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube