వీడియో వైరల్: ఏమై ఉంటుంది భయ్యా ఆమెకి.. గ్లాస్ డోర్ వద్ద ఆమె చేసిన పని చూస్తే..

ప్రస్తుతం ప్రపంచం సోషల్ మీడియా( Social media ) యుగంలో ప్రయాణం చేస్తుంది.వ్యూస్, లైకులు, షేర్లు అంటూ యువత సోషల్ మీడియా మత్తులో మునిగి తేలుతుంది.

 Viral Video: What Will Happen To Her If You See What She Did At The Glass Door,-TeluguStop.com

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు బహిరంగ ప్రదేశాలలో డాన్స్ చేయడం, అలాగే రకరకాల విచిత్ర పనులు చేయడం లాంటి పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.ఇకపోతే తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూస్తే ఆ అమ్మాయి ఏమైనా మద్యం తాగిందా అలా ప్రవర్తిస్తుంది అనకుండా ఉండలేరు.ఇక వైరల్ గా మారిన ఈ వీడియో పూర్తిగా చూస్తే.

స్టేడియం( Stadium ) లోపలి భాగం చుట్టూ గాజుతో కూడిన వాటిని ఏర్పాటు చేసి ఉంటుంది.అయితే అక్కడ స్టేడియం లోపల చాలామంది ఆటలాడుకుంటుంటారు.ఇకపోతే ఓ యువతి ఏదో పనిమీద తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చి బయటికి వెళ్లే క్రమంలో ఆమెకు ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది.అక్కడ ఏర్పాటు చేసిన గాజు అద్దాలు( Glasses) ఉండగా అక్కడ అమ్మాయికి తలుపు ఏదో అర్థం కాక నేరుగా వెళ్లి గాజును బలంగా గుద్దుకుంటుంది.

దాంతో దభేల్ మంటూ పెద్ద శబ్దం వినపడుతుంది.దాంతో పక్కనున్న ఇద్దరు మహిళలు కూడా ఆ అమ్మాయి వైపు చూడడం వీడియోలో గమనించవచ్చు.అలా అద్దాలను తగులుకొని తలకి నొప్పి పుట్టడంతో మూతిపై చేయి పట్టుకుని అక్కడ నుంచి బయటికి వెళ్లాలని మళ్ళీ ప్రయత్నిస్తుంది.అయితే మళ్లీ అక్కడ కూడా ఇదే పరిస్థితి నెలకొంటుంది.

అలా జరిగిన కానీ మరోసారి తలుపు ఎక్కడుందో చూసి వెళ్దాం అని అనుకోకుండా మూర్ఖంగా మళ్ళీ ప్రయత్నిస్తుంది.దీంతో మూడోసారి కూడా సదరు అమ్మాయికి గాజు తగిలి నొప్పి పుడుతుంది.

ఇక ఆ తర్వాత ఆమె ఎలాగోలా తలుపు ఎక్కడుందో కనిపెట్టి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతుంది.ఇక ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.ఆ అమ్మాయికి ఏమైనా కంటిచూపు సమస్య ఉందా.? లేకపోతే తాగినది దిగలేదా అంటూ కొందరు అంటుండగా మరికొందరైతే ఆ అమ్మాయి కేవలం వ్యూస్ కోసమే ఇలా చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube