ఇదేందయ్యా ఇది: ఆ స్టోర్ లో స్టాఫ్ ఉండరట.. మరి బిల్ అవసరం లేదా..?!

విదేశాలలో మాల్స్, స్టోర్స్, ఫాస్ట్ ఫుడ్ చైన్స్ లాంటి ఎన్నో ఔట్లెట్లలో ఎలాంటి స్టాప్ లేకున్నా సెల్ఫ్ చెక్ అవుట్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి వ్యాపారాలు కొనసాగిస్తు ఉండడం మనం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Viral Video: This Ramen Store In Seoul Has No Staff, , Seoul , Bill , Store, V-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెళితే.లీలి హున్( Lily Hun ) ఓ మహిళ ఫుడ్ బ్లాగర్ సిబ్బంది లేని స్టోర్ ను విజిట్ చేసింది.

తాను సందర్శించిన స్టోర్ సంబంధించి ఆవిడ ఓ ఇంస్టాగ్రామ్ రీల్ ను రూపొందించింది.సీయోల్( Seoul ) నగరంలో ఉన్న నూడుల్స్ స్టోర్ లో ఈ వీడియో చిత్రీకరించబడింది.ఓ కంటెంట్ క్రియేటర్ ప్రతిరోజు 24 గంటలు పని చేసే ఆ స్టోర్ లోపలికి అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్ళింది.ఇకపోతే ఆ నూడిల్స్ స్టోర్లో అనేక రకాల నూడిల్స్ ను చూపించి ఆపై ఆ స్టోర్లో ఉన్న ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్ కూడా ఎంజాయ్ చేయవచ్చని ఆవిడ తెలిపింది.

అలాగే మన తినడం పూర్తి అయితే ఆటోమేటిక్ మిషన్ లో మన కార్డు లేదా క్యాష్ తో పేమెంట్ చేయవచ్చని ఆవిడ తెలియచేసింది.ఇకపోతే ఈ స్టోర్లో ఒక్క స్టాఫ్ కూడా ఉండరని ఆవిడ తెలియజేసింది.ఒకవేళ ఆ స్టోర్ లో దొంగతనం జరుగుతాయి అనే అనుమానం కూడా వచ్చేవారికి ఆవిడ అక్కడ సీసీ కెమెరాలు ( CC cameras )ఉన్నాయని చెప్పుకొచ్చింది.అంతేకాదు ఆ స్టోర్ నిర్వాహకులు ప్రజలు వారంతకు వారే డబ్బులు పే చేస్తారని ప్రజలపై ఉన్న నమ్మకాన్ని తెలియజేసింది.

అంతేకాదు అక్కడ ఉన్న పలు రకాల ఉచితంగా లభించే పదార్థాలను గురించి కూడా ఆవిడ తెలియజేసింది.ఇలాంటి స్టోర్స్ లు ఒకవేళ భారతదేశంలో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరే ఊహించుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube