ఇదేందయ్యా ఇది: ఆ స్టోర్ లో స్టాఫ్ ఉండరట.. మరి బిల్ అవసరం లేదా..?!
TeluguStop.com
విదేశాలలో మాల్స్, స్టోర్స్, ఫాస్ట్ ఫుడ్ చైన్స్ లాంటి ఎన్నో ఔట్లెట్లలో ఎలాంటి స్టాప్ లేకున్నా సెల్ఫ్ చెక్ అవుట్ లాంటి టెక్నాలజీని ఉపయోగించి వ్యాపారాలు కొనసాగిస్తు ఉండడం మనం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం.
అయితే ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు వెళితే.లీలి హున్( Lily Hun ) ఓ మహిళ ఫుడ్ బ్లాగర్ సిబ్బంది లేని స్టోర్ ను విజిట్ చేసింది.
"""/" /
తాను సందర్శించిన స్టోర్ సంబంధించి ఆవిడ ఓ ఇంస్టాగ్రామ్ రీల్ ను రూపొందించింది.
సీయోల్( Seoul ) నగరంలో ఉన్న నూడుల్స్ స్టోర్ లో ఈ వీడియో చిత్రీకరించబడింది.
ఓ కంటెంట్ క్రియేటర్ ప్రతిరోజు 24 గంటలు పని చేసే ఆ స్టోర్ లోపలికి అర్ధరాత్రి దాటిన తర్వాత వెళ్ళింది.
ఇకపోతే ఆ నూడిల్స్ స్టోర్లో అనేక రకాల నూడిల్స్ ను చూపించి ఆపై ఆ స్టోర్లో ఉన్న ఫ్రిడ్జ్ లో కూల్ డ్రింక్స్ కూడా ఎంజాయ్ చేయవచ్చని ఆవిడ తెలిపింది.
"""/" /
అలాగే మన తినడం పూర్తి అయితే ఆటోమేటిక్ మిషన్ లో మన కార్డు లేదా క్యాష్ తో పేమెంట్ చేయవచ్చని ఆవిడ తెలియచేసింది.
ఇకపోతే ఈ స్టోర్లో ఒక్క స్టాఫ్ కూడా ఉండరని ఆవిడ తెలియజేసింది.ఒకవేళ ఆ స్టోర్ లో దొంగతనం జరుగుతాయి అనే అనుమానం కూడా వచ్చేవారికి ఆవిడ అక్కడ సీసీ కెమెరాలు ( CC Cameras )ఉన్నాయని చెప్పుకొచ్చింది.
అంతేకాదు ఆ స్టోర్ నిర్వాహకులు ప్రజలు వారంతకు వారే డబ్బులు పే చేస్తారని ప్రజలపై ఉన్న నమ్మకాన్ని తెలియజేసింది.
అంతేకాదు అక్కడ ఉన్న పలు రకాల ఉచితంగా లభించే పదార్థాలను గురించి కూడా ఆవిడ తెలియజేసింది.
ఇలాంటి స్టోర్స్ లు ఒకవేళ భారతదేశంలో ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరే ఊహించుకోండి.
డల్ స్కిన్ ను 20 నిమిషాల్లో సూపర్ బ్రైట్ గా మార్చే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీ కోసం!