వైరల్ వీడియో: రెండు మొసళ్ల మధ్య యుద్ధం మామూలుగా లేదుగా..!

ఒకప్పుడు ఈ భూమి మీద జీవించిన జంతువులలో ప్రమాదకరమైనది డైనోసర్.కానీ ఇప్పుడు అవి జీవించి లేవు.

 Viral Video The War Between Two Crocodiles Is Not Normal, Crocodile, Viral Lates-TeluguStop.com

ఇప్పుడు కూడా భూమి మీద సింహం, చిరుత, హైనా, పులి వంటి ప్రమాదకరమైన జీవులు చాలానే ఉన్నాయి.కానీ వీటన్నింటి కన్నా ప్రమాదకరమైన క్రూరమైన జంతువూ ఏది అంటే అది మొసలి( Crocodile ) అనే చెప్పాలి.

ఇలా చెప్పడానికి ఒక బలమైన కారణం ఉంది.ఆ కారణం ఏంటని అనుకుంటున్నారా.? ఐతే ఈ విషయం తెలుసుకోవలసిందే.

మొసలి బలం నేల మీద కన్నా నీటిలో పదింతలు అవుతుంది.

అందుకే దీనికి “నీటి రాక్షసుడు” అని పేరు.మొసలిలో మరొక ఆశ్చర్యకరమైన లక్షణం ఏమిటంటే.

ఇవి తమ జాతినే చంపి తింటాయి.కొన్నిసార్లు తల్లి మొసలి తన సొంత పిల్లలనే చంపి తింటుంది.

భూమి మీద అత్యంత ప్రమాదకరమైన జంతువులైన డైనొసర్లలో కూడా ఈ లక్షణం లేదు.ఐతే ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే… ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో రెండు మొసళ్ళు పోట్లాడుకోవడం కనిపిస్తుంది.ఒక మొసలి మరో మొసలిపై దాడి చేస్తుంది.

అంతలోనే దాడి చేసిన మొసలి మెడ మరో మొసలి కొరుకుతుంది.పెద్ద మొసలి చెరువులోకి వెళ్లాలని ప్రయత్నిస్తుంటే మరొక మొసలి దానిని ఆపి దాడి చేయడం కనిపిస్తుంది.

ఒక మొసలి మరొక మొసలి మెడను పట్టుకుంటే, మరొక మొసలి రెండో మొసలి తోకను పట్టుకుంటుంది.ఇలా ఆ రెండు మొసళ్ళు పెద్ద యుద్ధమే చేసుకుంటున్నాయి.

ఆ తర్వాత రెండు దొర్లుతూ చెరువులో పడిపోతాయి.చివరకు ఈ భీకర యుద్ధంలో ఎవరు గెలిచారన్నది మాత్రం తెలియలేదు.

Telugu Crocodile, Latest-Latest News - Telugu

తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తోంది కదూ.ఇంతటి భయానక సన్నివేశాన్ని చూడడమే కాదు.ఒకరు వీడియో కూడా తీశారు.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.ఇప్పటివరకు ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్ రాగా అనేకమంది ఈ వీడియో చాలా భయంకరంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube