వైరల్ వీడియో: ఇతగాడిని చుట్టేసిన సొరచేప.. చివరికి..?!

సముద్రంలో ఎన్నో రకాల జీవులు నివశిస్తుంటాయి.వాటిలో కొన్ని మంచి చేస్తే ఇంకొన్ని ప్రాణహాని కలిగించేవిగా ఉంటాయి.

సముద్రంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన జీవుల్లో సొర చేపలు కూడా ఉన్నాయి.ఇవి నీళ్లలో వేగంగా కదులుతూ క్షణంలో దేన్నైనా చంపగల స్థితిలో ఉంటాయి.

సొరచేపలు మనుషుల్ని అతి దారుణంగా చంపగలవు.ఇటువంటి సొరచేపలకు ప్రతి సంవత్సరం కూడా ఎంతో మంది చనిపోతున్నారు.

ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని వేల సంఖ్యలో జనాలు చనిపోతున్నారంటే వాటి ప్రభావం ఎలా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు.ఒక్కసారి సొర చేపల కంట్లో పడితే వాటిని తప్పించుకోవడం చాలా కష్టమనే చెప్పాలి.

Advertisement

అందులో కొందరు మాత్రమే బతికి బట్టకట్టిన వారు ఉన్నారు.చత్రపతి సినిమాలో కూడా ప్రభాష్ సొర చేప నుంచి తప్పించుకుని దానని బంధించగలుగుతాడు.

ఇకపోతే తాజాగా అలాంటి ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది.మాట్ వుడ్ అనే ఒక పైలట్ ఆస్ట్రేలియాలోని ఓ బీచ్ కి ప్రయాణమయ్యాడు.

ఆ సమయంలో సరదాగా ఆయన బాల్కనీలో కూర్చొని డ్రోన్ ను ఎగురవేశారు.ఆ టైంలోనే ఓ వ్యక్తి అతనికి కనిపించాడు.

ఆ ఈతగాడి చుట్టు చూస్తే ఓ భారీ సొర చేప కనిపించింది.డ్రోన్ పైలట్ వెంటనే అక్కడ ఏం జరుగుతుందోనని డ్రోన్ సాయంతో చూడగటిగాడు.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

సముద్రంలోని వ్యక్తి చుట్టూ ఓ భయంకర మాకో షార్క్ తిరుగుతున్నట్టు గ్రహించాడు.ఆ వ్యక్తి బతికే ఉన్నట్టు తెలుసుకున్నాడు.

Advertisement

ఆ సమయంలో ఆ వ్యక్తి సొర చేతో పోరాటం చేస్తున్నాడు.స్పియర్ గన్ తో దానిని షూట్ చేస్తున్నాడు.

వెంటనే అప్రమత్తమైన పైలెట్ సముద్రంలోకి జెట్ స్కై సాయంతో తమ సిబ్బందిని పంపించాడు.ఆ వ్యక్తి వద్దకు వారు చేరుకునేందుకు సరిగ్గా 30 నిమిషాలకు పైగా అయ్యింది.

అప్పటికే షార్క్‌తో పోరాటం చేసి ఆ వ్యక్తి సముద్రం ఒడ్డుకు వచ్చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజా వార్తలు