వైరల్ వీడియో: ఎలుకను పాము ఎలా మింగేసిందో చూడండి

సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.మనుషులపై జంతువులు దాడి చేసే వీడియోలు, జంతువులను మనుషులు వేటాడే వీడియోలు బాగా వైరల్‌గా మారుతూ ఉంటాయి.

 Viral Video Snake Catches Rat And Escapes Inside Ac Details, Rat, Snake, Eaten,-TeluguStop.com

అలాగే ఒక జంతువు మరో జంతువుపై దాడి చేసి చంపేసే వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి.తాజాగా అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో( Social Media ) వైరల్‌గా మారింది.

చిన్న జంతువులను పెద్ద జంతువులు వేటాడి తినడం మనం చూస్తూ ఉంటాం.ఆహారం కోసం పెద్ద జంతువులు చిన్న జంతువులపై దాడి చేసి చంపేసి తింటూ ఉంటాయి.

చిన్న జంతువులను పెద్ద జంతువులు క్రూరంగా చంపేసి ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి.

ఇక పాములైతే( Snakes ) ఎలుకలు, చిన్న చిన్న పక్షులు, క్రిములను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి.తాజాగా ఒక ఎలుకను( Rat ) పాము మింగేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎలుకను పాము టక్కున మింగేసింది.

ఒక పాము ఎయిర్ కండీషనర్( Air Conditioner ) నుంచి బయటకు వచ్చింది.అనంతరం ఒక ఎలుకను ఏసీలోకి తీసుకెళుతుంది.

ఎయిర్ కండీషనర్‌లోకి ఎలుకను లాగుతుంది.ఎలుక తలను పాము మూతితో పట్టుకుని లోపలికి లాక్కుంది.

నెమ్మదిగా ఎలుకను పట్టుకుని లోపలికి తీసుకెళ్లింది.ది యానిమల్ అంపైర్ అనే అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశారు.

ఒక రోజు క్రితం ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షకుపైగా వ్యూస్ రాగా.2 వేల మంది లక్స్ కొట్టారు.అలాగే ఈ వీడియోకు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

ఎవరూ ఎక్కడా సురక్షితంగా లేరని, ఈ పాము కూడా అదే చెప్పే ప్రయత్నం చేస్తోందని ఒక నెటిజన్ కామెంట్ చేశారు.ఒక జంతువుకి ఆహారం కావాలంటే మరో జంతువు బలి కావాల్సిందే అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube