చెవిటి వ్యక్తితో మూగ భాష మాట్లాడిన పిల్లి.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే!

సాధారణంగా పిల్లులు చాలా తెలివైనవని అంటుంటారు.అయితే అన్నట్లుగానే క్యాట్స్ తమ తెలివిని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుంటాయి.

 Viral Video See How Pet Cat Communitcating With Its Deaf Owner Details, Cat, Vi-TeluguStop.com

పేరు పెట్టి పిలిచినా ఇవి వెంటనే పలుకుతాయి.అలాగే ఇవి ఓనర్ల వాయిస్ వినగానే వెంటనే గుర్తించగలవు.

ఆకలి అవుతుంటే ఫుడ్ అందించమని అడగగలవు.అంతేకాదు ఇవి ఎంత కష్టమైన పనినైనా ఈజీగా నేర్చుకోగలవు.

ఐతే ఒక పిల్లి తన చెవిటి ఓనర్ తో కమ్యూనికేట్ అయ్యేందుకు ఏకంగా సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంది.అలా అది తన ఓనర్ తో కమ్యూనికేట్ అవుతూ తనకు ఏం కావాలో అడిగిమరీ తీసుకుంటుంది.

ఇది ఫుడ్ కావాలంటూ తన ఓనర్ కు సైగ చేస్తూ అడిగిన తీరు ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.దీనికి సంబంధించిన వీడియోని చూసిన నెటిజన్లు వావ్ అంటున్నారు.

ఇది ఓల్డ్ వీడియో అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ అన్ని సోషల్ మీడియా సైట్స్ లో చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక పిల్లి సంకేతాల ద్వారా తన యజమానితో కమ్యూనికేట్ చేయడం చూడొచ్చు.

మొదటగా ఇది తన యజమాని చేతిపై ముందు కాలుతో తట్టడం గమనించవచ్చు.యజమాని తన వైపు చూడగానే చేతి ని తన నోటి దగ్గర పెట్టుకొని తనకు ఆహారం కావాలంటూ అడిగింది.ఫుడ్ తన నోటికి అందించాలి అంటూ అది చాలా పర్ఫెక్ట్ గా అడిగింది.ఈ సైగలు ఎవరికైనా అర్థం అవుతాయి.సదరు చెవిటి ఓనర్ కూడా దీన్ని వెంటనే అర్థం చేసుకున్నాడు.అనంతరం దానికి ఫుడ్ అందించాడు.

దీనితో అది హాయిగా తినేసింది.ఈ అద్భుతమైన వీడియో ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube