వైరల్: స్కూల్‌లో టీచర్‌కి దమ్కీ ఇచ్చిన బుడ్డోడు.. మిస్! నాతో పెట్టుకోవద్దు మా నాన్న పోలీస్?

ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో చిన్న పిల్లల ఇన్నోసెంట్‌ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈమధ్యన కోపంగా ఉన్న మేడమ్‌ను బుజ్జగించడం కోసం ఆమె బుగ్గలపై ఓ విద్యార్థి ముద్దుపెట్టిన సంగతి మరిచిపోక ముందే ఓ వీడియో దానికి రివర్స్ కౌంటర్ లాగ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

 Viral Video School Student Sweet Warning To Teacher Details, School Teacher, Vir-TeluguStop.com

కాగా ఆ చిన్నారి వీడియో నెటిజన్ల దృష్టిని విపరీతంగా ఆకర్షించడంతో తెగ పాపులర్ అవుతోంది.అయితే ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఇక వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి చూస్తే, ఓ స్టూడెంట్‌ ఏడుస్తూనే తన టీచర్‌ను బెదిరించడం అందులో గమనించవచ్చు.ముందుగా అమాయకంగా ముఖం పెట్టి, ‘మా నాన్న పోలీస్‌!’ అని అంటాడు.

దీనికి రిప్లైగా మేడమ్‌ ‘అయితే ఏం చేయాలి?’ అని సమాధానమిస్తుంది.ఆ తర్వాత విద్యార్థి ‘గోలీమార్‌ దేంగే (బుల్లెట్‌తో కాలుస్తాను)’ అని చెబుతాడు.

దీనికి టీచర్‌ నవ్వుతూ ‘నీకు చదువుకోవడం ఇష్టం లేదా’ అని అడుగుతుంది.దానికి వాడు సమాధానం చెప్పడు.

అయితే బాబు తీరుపై మాత్రం నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించడం కొసమెరుపు.

సదరు వీడియోను @Gulzar_sahab అనే ట్విట్టర్‌లో హ్యాండిల్‌తో ‘మా నాన్న పోలీస్’ అన్న క్యాప్షన్ జోడించి షేర్ చేశారు.కాగా నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మిక్స్‌డ్‌ రియాక్షన్లు వస్తున్నాయి.కొంతమంది వీడియో ఫన్నీగా ఉందని కామెంట్‌ చేస్తుంటే, మరికొందరు మాత్రం చిన్న పిల్లల్లో ఇలాంటి ఆలోచనలు చాలా బాధాకరం అని హెచ్చరిస్తున్నారు.

మరికొందరైతే వాడి నాన్న వాడికి అదే నేర్పాడా? అని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube