వైరల్ వీడియో... ఆ యువకుల భజనకు ప్రధాని మోడీ ఫిదా

మన దేశంలో టాలెంట్ కు కొదవలేదు.ప్రతి ఒక్క రంగంలో మట్టిలో మాణిక్యాలు చాలా మంది ఉంటారు.

కాని వారిని గుర్తించి బయటకు తీసి వాళ్ళ టాలెంట్ కు కొంత పదును పెడితే సమాజంలో వారికంటూ ఓ గొప్ప స్థానం ఉంటుంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో కళాకారులు ఎక్కువ మంది ఉంటారు.

అయితే చాలా మంది వెలుగులోకి రాకుండానే కనుమరుగైపోతారు.ఇక అసలు విషయంలోని వెళ్తే ఓ ఇద్దరు యువకులు శివ భజన చేస్తూ తన రోజూ వారి కార్యకలాపాలను వెళ్ళదీస్తున్నారు.

అయితే ఆ ఇద్దరు యువకులు చేస్తున్న అద్భుతమైన శివ భజనను ఒకరు వీడియోలో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.ఇక ఆ వీడియో దేశ వ్యాప్తంగా వైరల్ అయింది.

Advertisement

దేశ వ్యాప్తంగా ఉన్న నెటిజన్ల మనసు చూరగొంది.అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రధాన మంత్రి మోదీ ఈ వీడియో చూసి ఫిదా అయ్యారు.

వీడియో చూసిన తరువాత మోదీ తన ట్విట్టర్ లో బహుత్ బడియా అంటే చాలా గొప్పగా ఉంది అని అభినంందించారు.ఇక మోడీ అభినందించడంతో ఈ వీడియో మరింత వైరల్ గా మారింది.

మోదీ సైతం అభినందించిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

వీడియో వైరల్ : ఏంటి రింకూ సింగ్ మరీ డబ్బులు అంత ఎక్కువయ్యాయ?
Advertisement

తాజా వార్తలు