వైరల్ వీడియో: అమెజాన్ పార్సల్ లో ప్రత్యక్షమైన నాగుపాము..

ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా వస్తువు కావాలంటే.ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం సర్వసాధారణం అయింది.

అయితే తాజాగా బెంగళూరు నగరానికి చెందిన ఒక జంటకు వింత అనుభవం చోటు చేసుకుంది.అది ఏంటంటే.

ఆ జంట ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ లలో ఒకటైన అమెజాన్ ఇండియా ద్వారా ఎక్స్ బాక్స్ కంట్రోల్ ను ఆర్డర్ చేశారు.ఇక ఆర్డర్ చేస్తే ఆటోమ్యాటిక్ గా పార్సెల్ అందుకు సంబంధించి ఇంటికి వచ్చింది.

ఇక ఆ జంట అమెజాన్ ప్యాకేజ్( Amazon package ) ఓపెన్ చేసి కడగా అందులో ఉన్న పామును చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.అయితే వాళ్ళ అదృష్టవశాత్తు ఆ విషపూరితమైన పాము ప్యాకేజింగ్ టేపుకు అతుక్కుపోవడంతో ఎటువంటి హాని కలగలేదు.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్ గా మారింది.

సదరు బాధిత జంట ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ .వాళ్లు రెండు రోజుల క్రితం అమెజాన్ నుండి ఎక్స్ బాక్స్ కంట్రోల్ ను ఆర్డర్ చేయగా.వచ్చిన పార్సెల్ ని ఓపెన్ చేసి చూడగా ప్యాకేజీ లో బతికున్న పామును చూసి ఒక్కసారిగా షాక్ కు గురైనట్లు తెలియజేశారు.

వారు బెంగళూరు( Bengaluru )లోని సజ్జాపూర్ రోడ్ లోనివాసం ఉంటున్నారని, ఘటనకు సంబంధించిన పూర్తి సంఘటనను కెమెరాలో బంధించామని, అంతేకాకుండా ప్రత్యేక సాక్షులు కూడా ఉన్నారని బాధితుడు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

ఇక ఈ విషయంపై అమెజాన్ ప్రతినిధులతో మాట్లాడగా వారు ప్రతిస్పందన ఇచ్చారు.కస్టమర్ వీడియో పై అమెజాన్ కంపెనీ స్పందిస్తూ ఓ పోస్ట్ చేసింది.మీకు జరిగిన ఈ అసౌకర్యానికి మమ్మల్ని క్షమించాలి అంటూ, ఇందుకు సంబంధించిన దాని కోసం మేము మరింత తనిఖీ చేయాలనుకుంటున్నాము.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
వైరల్: 20 సంచుల నిండా నాణేలతో కోర్టుకెళ్లిన వ్యక్తి... అందరూ షాక్!

అలాగే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మాకు తెలియజేయండని కోరారు.అంతేకాకుండా త్వరలోనే మేము మీ వద్దకు తిరిగి వస్తాము అంటూ తెలిపింది అమెజాన్ సంస్థ.ఎటువంటి ప్రాణహాని కలగకుండా ఆ పామును సురక్షిత ప్రాంతంలో వదిలేసినట్లు తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు