వైరల్ వీడియో: సముద్రం మధ్యలో బోటింగ్ చేస్తుంటే అనుకోని అతిధి.. ఇంతలో..!?

సోషల్ మీడియాలో పాములకు సంబంధించిన చాలా వీడియోలు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి.నెటిజన్లు సైతం జంతువుల వీడియోలను బాగా ఇష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఒక పాముకు సంబంధించిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతుంది.సరదాగా ఒక వ్యక్తి లోతైన సముద్రంలో బోటింగ్ చేద్దామని వెళ్ళాడు.

అయితే ఉన్నటుండి ఒక పాము అతను ఉన్న బోట్ దగ్గరకు రావడం అతడు గమనించి షాక్ అయ్యాడు.మరి ఆ వ్యక్తి ఆ పాము చెర నుండి తనను తాను ఎలా కాపాడుకున్నాడు అనేదే ఈ వీడియో సారాంశం అన్నమాట.

పాముల గురించి మన అందరికి తెలిసిందే.పాములు భూమి మీద ఎలా అయితే పాకుతాయో నీటిలో కూడా అలానే పాకుతాయి అనే విషయం మన అందరికి తెలిసిందే.

Advertisement

అయితే బోటింగ్ చేసే వ్యక్తి తాను ఆ పామును ఎలా ఎదుర్కొన్నాడో అనేది తన సెల్‌ఫోన్‌ లో రికార్డ్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట్లో వైరల్ అయింది.ఎవరయినా సరే అనుకోని పరిమాణాల్లో ఏదైనా హానికర జంతువును చూసినప్పుడు వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టడం సర్వ సాధారణమైన విషయం అనే చెప్పాలి.

అయితే సముద్రం నడి బొడ్డున బోర్డింగ్ చేస్తున్న ఆ వ్యక్తి కూడా సరిగ్గా అలానే భయపడ్డాడు.బోట్ కి కొద్ది దూరంలో ఒక పాము అతివేగంగా బోట్ వైపు రావడం మనం వీడియోలో చూడవచ్చు.

ఆ పాము అయితే చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది.ఎందుకంటే స్వచ్ఛమైన నీటిలో జరా జరా పాకుతూ బోట్ దగ్గరకు వస్తున్న పామును చూస్తే ఎవరయినా షాక్ అవ్వాలిసిందే.

అలా ఆ పాము పడవ పక్కకు వచ్చి పడవ లోపలకు తల ఆనించి లోపలికి రావడానికి చూస్తుంది.కానీ అప్పటికే ఆ పామును గమనిస్తున్న ఆ వ్యక్తి చేయితో ఆ పాముని ఆపుతూ, నోటితో ఏవో శబ్దాలు చేస్తూ దానికి సైగ చేయడం మనం వీడియోలో చూడవచ్చు.అయితే విచిత్రం ఏంటంటే.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

ఆ పాము కూడా అతను అలా సైగలు చూసేటప్పటికి భయపడిపోయి బోట్ ను వదిలి వెనక్కి వెళ్ళిపోతుంది.తరువాత పడవకు కొంచెం దూరంగా వెళ్లి మళ్ళీ సముద్రంలో మునిగి కనిపించకుండా పోవడం వీడియోలో చూడవచ్చు.

Advertisement

ఆ పాము అతన్ని విడిచి వెళ్లిపోవడంతో బోట్ లో ఉన్న వ్యక్తి ఆనందపడతాడు.సాధరణంగా సముద్రపు పాములు ఏవయితే ఉన్నాయో అవి మనుషుల దరి దాపులకు కూడా రావట.

బహుశా అందుకేనేమో బోట్ లో ఉన్న వ్యక్తి అరవడంతో అది వెనక్కి తిరిగి పారిపోయింది.

తాజా వార్తలు