ప్రతిరోజు సోషల్ మీడియాలో రకరకాల జంతువుల వీడియోలు బాగా పాపులర్ అవుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పుడు జంతువులకు సంబందించిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది.
మొసలి గురించి మన అందరికి తెలిసే ఉంటుంది.నీటిలో ఉంటుందని, చిన్నా చితక జీవులను చంపి తన ఆకలి తీర్చుకుంటుందని మనకు తెలుసు.
అలాగే నీటిలో ఉండే మొసలికి ఎంత బలం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఎంతటి పెద్ద జంతువైన సరే మొసలి కంట్లో పడిందంటే మటాష్ అయిపోతుంది.
ఎంతో చాకిచక్యంగా తన కంట పడిన జంతువులను అమాంతం నోటా కరుసుకుని నీటిలోకి తీసుకుని పోతుంది.మరి అంతటి బలశాలి అయిన మొసలికి ఊహించని ఎదురు దెబ్బ ఒకటి తగిలింది.
మరి అసలు జరిగిందో తెలుసుకుందాం.
నేనే గొప్ప, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అని తలపొగరుగా ఉంటే ఎప్పటికయినా ఆపదలో పడాలిసిందే.
ఎందుకంటే ఎవరికయినా గాని ఎదో ఒక వీక్ నెస్ అనేది తప్పకుండా ఉంటుంది.కాని మొసలి మాత్రం ఆ విషయాన్నీ గ్రహించకుండా ఏకంగా ఒక కొండ చిలువనే చంపాలని చూసింది.
మరి కొండ చిలువ ఊరుకుంటుందా చెప్పండి.ఏ జంతువు అయిన తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎదుటి వాళ్లపై పోరాటం చేస్తుంది.
అలాగే కొండ చిలువ కూడా మొసలి నుంచి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం చాలానే కష్టపడింది.కొండచిలువను నోట కరిచిన మొసలికి అనుకోని పరిణామం ఎదురయింది.
ప్రస్తుతం మొసలి కొండ చిలువకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనకొండను చూస్తే ఎవరన్నా బయపడతారు.ఎందుకంటే అది విష సర్పం.కావున భారీ విషసర్పాల జోలికి ఏ జంతువులు వెళ్ళవు.
కానీ ఒక మొసలి మాత్రం అవేమి లెక్కచేయకుండా ఒక భారీ కొండ చిలువ దగ్గరకు వెళ్లి దాని తలను గట్టిగా కొరికి పట్టుకుంది.అనకొండ ఎమన్నా తక్కువ తిందా ఏంటి అది కూడా మొసలి మీద ఎదురుదాడికి దిగింది.ఆ మొసలిని చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసింది.దీనితో చేసేదేమీ లేక ఆ మొసలి ప్రాణాలు విడిచింది.
ఈ వీడియోను ది వైల్డ్ అనే యూట్యూబ్ ఛానెల్ సోషల్ మీడియా లో అప్‌లోడ్ చేసింది.ఈ వీడియో చుసిన ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున లైకులు, కామెంట్లు పెడుతున్నారు.