వైరల్ వీడియో: పెద్ద పెను ప్రమాదం నుంచి తప్పించుకున్న కార్ డ్రైవర్.. లోయలో పడ్డ కారు..

ప్రతిరోజు మనం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలను గమనిస్తూనే ఉంటాం.ఈ నేపథ్యంలో కొన్ని వీడియోలు వైరల్ గా మారుతుంటాయి.

 Viral Video Car Driver Escaped From A Big Accident The Car Fell Into The Valley-TeluguStop.com

ఈ వీడియోలలో చాలా వీడియోలు కేవలం నవ్వు తెప్పించేవి ఎక్కువగా ఉండగా మరికొన్ని భయంకరమైన విషయాలకు సంబంధించి కూడా వీడియోలు ఉంటాయి.అప్పుడప్పుడు జంతువులకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి.

ఇకపోతే తాజాగా ఓ అనుకోని సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో ఒక కారు( Car ) అద్భుతప్పి లోయలో పడిపోగా అందులో నుంచి కారు డ్రైవర్( Car Driver ) తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్న సంఘటన సంబంధించి ఉంటుంది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

మామూలుగా కారు నడపాలంటే అందుకు సంబంధించి ఎంతో నైపుణ్యం కలిగి ఉండాలి.ముఖ్యంగా ఎత్తయిన పర్వత ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో కారు నడపాలంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.లేకపోతే చివరికి ప్రాణాలు కూడా దక్కవు.

దీనికి కారణం ఎతైన పర్వత ప్రాంతాలలో అనేక మలుపులు, అలాగే లోతైన ప్రదేశాలు ఉండడం కారణంగా ఒక వేళ జరగరాని పొరపాటు జరిగితే ప్రాణాలు అమాంతం గాల్లో కలిసిపోతాయి.

ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన వీడియోలో ఓ ముగ్గురు వ్యక్తులు కారును కొండ ప్రాంతాలలోకి( Mountain Area ) వెళ్లిన సమయంలో దానిని బయటికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇద్దరు వ్యక్తులు కారు వెనుక భాగానికి వచ్చి కారును ముందుకు తోసేందుకు ప్రయత్నం చేస్తుండగా ఓ వ్యక్తి కారులో ఉండి దానిని నడిపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.అయితే వారి ప్రయత్నం ఫలించకపోవడంతో ఆ కారు పక్కనే ఉన్న లోయలోకి దూసుకు వెళ్ళింది.

అయితే పరిస్థితిని అర్థం చేసుకున్న కారులోని వ్యక్తి వెంటనే కారులో నుంచి బయటికి దూకేయడంతో అతనికి పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు.అయితే ఈ ఘటనలో కారు మాత్రం లోయలోకి పడిపోయింది.

ఈ ఘటన జమ్మూ కాశ్మీర్( Jammu Kashmir ) ప్రాంతంలో జరిగినట్లుగా కొందరు ఈ వీడియో చూసిన నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.కాబట్టి ఎవరైనా పర్వత ప్రాంతాలలో లేదా కొండ ప్రాంతాలలో కారు నడుపుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని సాఫీగా ప్రయాణం సాగిస్తే ప్రాణాలతో బయటపడవచ్చు లేకపోతే ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube