వైరల్: పెళ్లి మండపంలోని పెళ్లికూతురు చేతిలో గన్..!

మన దేశంలో పెళ్లి వేడుకలు ఒకప్పటిలా ఉండట్లేదు.నేటి యువత ట్రెండ్ కు తగ్గట్టుగా వెడ్డింగ్ లను స్పెషల్ గా ప్లాన్ లు చేస్తున్నారు.

 Viral Video Bride Shoots Gun In Wedding Ceremony In Uttarpradesh Details, Bride,-TeluguStop.com

బంధువులు, స్నేహితులతో కలిసి హుషారుగా తమ పెళ్ళి వేడుకను కలకలం గుర్తుండిపోయేలా ఒక తియ్యని అనుభూతిలా మలుచుకొవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ప్రీవెడ్డింగ్ షూట్ నుంచి అప్పగింతల వరకు ప్రతి ఒక్క కార్యక్రమం స్పెషల్ గా ఉండేలా చూసుకుంటున్నారు.

అందులో భాగంగానే పుట్టిన రోజు, పెళ్లి వేడుకల్లో తుపాకులు పట్టుకొని డ్యాన్స్‌లు వేయడం, గన్స్ పట్టుకొని ఊరేగింపులో పాల్గొనడం ఫ్యాషన్‌గా మారిపోయింది.ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఓ రిసెప్షన్‌లో ఏకంగా పెళ్లి కూతరు చేతికి తుపాకి ఇచ్చి కాల్పులు జరిపించారు బంధువులు.

ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

భరత్‌ఖండ్ కి చెందిన అశిఫ్‌రాజాకు ఈనెల 5వ తేదిన నవ్‌గాచియా లోని బల్హాలో మ్యారేజ్ జరిగింది.

అనంతరం మే 10వ తేదిన భరత్‌ఖండ్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.రిసెప్సన్ కి బంధు, మిత్రులు హాజరయ్యారు.రిసెప్షన్‌ వేదికపై నూతన వధు, వరులు ఉండగా.ఇంతలో ఓ యువకుడు గన్ తెచ్చి పెళ్లి కూతురు చేతిలో పెట్టాడు.

తుపాకి పైకి గురి పెట్టి కాల్చమన్నాడు.అందుకు కొత్త పెళ్లి కూతురు కాస్త సిగ్గుపడటంతో.

ఆ యువకుడే స్వయంగా చేతిలో తుపాకి పెట్టి తానే కాల్పులు జరిపించాడు.

తుపాకీ తూటా పేలడంతో అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.దీంతో పెళ్లి కొడుకు కాస్త భయపడి వెనక్కి వెళ్లినప్పటికి.పెళ్లి కూతురు మాత్రం తుపాకీని చేతిలో పెట్టి కాల్పులు జరిపిస్తుంటే దుపట్టా సర్దుకొని బుల్లెట్స్ పేల్చింది.

తుపాకీ పైకి గురిపెట్టి కాల్చడం వల్ల ప్రమాదం తప్పింది కాని.ఒకవేళ గురి తప్పి ఎవరికైనా తగిలి ఉంటే పరిస్థితి ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube