కారులో నుంచి ఒక్కసారిగా మాయమైన చిన్నోడు.. దెయ్యమేనా.. వీడియో వైరల్!

కెమెరాల్లో రికార్డు అయ్యే కొన్ని వీడియోలు చూస్తున్నప్పుడు మన కళ్ళను మనమే నమ్మలేం.ఎందుకంటే అందులో కనిపించే దృశ్యాలు మానవ అతీతంగా అనిపిస్తాయి.

 Viral Video Boy Suddenly Disappeared In The Amusement Park Shocked Netizens Details, Car, Missed,boy, Viral Latest, News Viral, Social Media , Boy Vanished, Super Natural Videos, Malaysia, Amusement Partk, Johar State, Noor Afrina Roshni, Maiz-TeluguStop.com

మనుషులు గాల్లో తేలడం, ముట్టుకోకుండానే ఇతరులను చితక కొట్టడం వంటి సూపర్ నేచురల్ వీడియోస్ మీరు చూసే ఉంటారు.ఈ తరహా వీడియోలు ఎల్లప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి.

తాజాగా ఈ కోవకు చెందిన మరొక వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఒక బాలుడు ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు దీంతో అతడు నిజంగా మనిషివేనా లేక దెయ్యమా అని నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

 Viral Video Boy Suddenly Disappeared In The Amusement Park Shocked Netizens Details, Car, Missed,boy, Viral Latest, News Viral, Social Media , Boy Vanished, Super Natural Videos, Malaysia, Amusement Partk, Johar State, Noor Afrina Roshni, Maiz-కారులో నుంచి ఒక్కసారిగా మాయమైన చిన్నోడు.. దెయ్యమేనా.. వీడియో వైరల్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.ఇటీవల మలేషియా దేశం, జోహార్‌ రాష్ట్రంలోని ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి నూర్ అఫ్రీనా రోస్నీ (30) అనే ఒక మహిళ తన 5ఏళ్ల కుమారుడితో కలిసి వెళ్ళింది.

ముయిజ్ అనే ఈ 5 ఏళ్ల కుమారుడు ఆ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో బాగా ఎంజాయ్ చేశాడు.ఈ పార్క్ లో గుండ్రంగా తిరిగి కారులో కూడా ఎక్కాడు.

రంగులరాట్నంలా తిరిగే ఈ కారులో కూర్చున్నప్పుడు ముయిజ్ పక్కనే మరో బాలుడు కూర్చున్నాడు.ఈ చిన్నోడు ఒకేసారి మాయమయ్యాడు.

ఈ విచిత్ర ఘటనను తల్లి తన వీడియోలో రికార్డు చేసింది.అనంతరం ఈ వీడియోని ది సన్ అనే ఒక ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.

వీడియో చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో.ఒక పచ్చ కారులో ముయిజ్‌తో పాటు మరొక బాలుడు కూర్చొని ఉండటం చూడవచ్చు.ఈ కారు గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఇద్దరూ కనిపించారు.

అయితే అది మరొక రౌండ్ చేస్తున్న సమయంలో ముయిజ్‌తో పాటు కారులో కూర్చున్న బాలుడు అదృశ్యమై పోయాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ఇది ఎడిటెడ్ వీడియో అని ఒకరంటే… బాలుడు కారులో కిందకి వంగి కూర్చున్నాడు అని మరొకరు అంటున్నారు.మరికొందరు మాత్రం ఆ బాలుడు దెయ్యం ఏమో అని భయపడుతున్నారు.

వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube